ఫోకస్

ఇతర శక్తుల చొరబాటే కారణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (హెచ్‌యుసి) జరిగిన సంఘటనలు కానీ, ఢిల్లీలోని జెఎన్‌యులో జరిగిన సంఘటనలు కానీ దాదాపు ఒకేరకమైనవి. విద్యాసంస్థలలో ఇతర శక్తులు జోరబడటంతో వల్లనే ఈ పరిణామాలకు కారణం. ఈ రెండు యూనివర్సిటీలపై కూడా స్థానిక ప్రభుత్వాల ఆజమాయిషీ లేకపోవడం కూడా అక్కడ జరిగిన పరిణామాలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విషయం కాదని ఇక్కడ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. హెచ్‌యుసిలో గొడవలు జరగడానికి ప్రధానంగా వైస్ చాన్స్‌లర్ కారణమని విద్యార్థి సంఘాలు కొన్ని ఆరోపిస్తుండగా, మరి కొన్ని సంఘాలు వాటితో విభేదిస్తున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా సమస్యను చలర్చాడానికి వైస్ చాన్స్‌లర్‌ను కొన్ని రోజులు సెలవుపై పంపించడంతో దాదాపు సమస్య సమసిపోయిందనుకున్నారు. కానీ ఆయన గుట్టు చప్పుడు కాకుండా విధుల్లో చేరడంతో పరిస్థితి మళ్లీ అదుపు తప్పింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మొదటి సమస్యకు మూలాలు ఏమిటో కానుక్కోవాలి. క్షేత్రస్థాయిలో సమస్యను విశే్లషించి, విద్యార్థులను, బోధనా, బోధనేతర సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేసి వారి మధ్యలో సమన్వయం కుదుర్చాలి. ఇలాంటి చొరవ అక్కడ జెఎన్‌యులో కానీ ఇక్కడ హెచ్‌యుసిలో కానీ తీసుకున్న దాఖలాలు లేవు. పైగా విద్యార్థులను మరింత రెచ్చగొట్టే రీతిలో నిర్ణయాలు జరగడం వల్లనే సమస్య జఠిలం అయింది. దీంట్లో మొత్తంగా ప్రభుత్వాన్ని కానీ, వర్సిటీ యాజమాన్యాన్ని కానీ ఏకపక్షంగా తప్పు పట్టలేం. ఇందులోకి రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ స్వార్థం కోసం జోరబడి సమస్యను మరింత పెద్దది చేశాయని చెప్పవచ్చు. అందుకే రాజకీయంగా సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటే వాటిని తేల్చుకోవడానికి బయటి చాలా వేదికలు ఉన్నాయి కానీ, విద్యాసంస్థలను వేదికగా చేసుకోవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు అన్ని పార్టీలకు కనువిప్పు కావాలి.

- గెల్లు శ్రీనివాస్ అధ్యక్షుడు, టిఆర్‌ఎస్‌వి విభాగం ఉస్మానియా యూనివర్సిటీ