ఫోకస్

దోషిని వీసీగా ఎలా నియమిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పరిశోధన విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న విసి అప్పారావును ప్రభుత్వం తిరిగి ఎలా నియమిస్తుంది? ఒకవైపు విచారణ జరుగుతుండగా, నిందితుడిగా ఉన్న విసి అప్పారావుకు మళ్లీ బాధ్యతలు అప్పగించడం విద్యార్థులను రెచ్చగొట్టే ధోరణి తప్ప మరొకటి కాదు. విశ్వవిద్యాలయాలు భావసంఘర్షణ కేంద్రాలుగా ఉండాలి తప్ప ఆర్‌ఎస్‌ఎస్ మతోన్మాద కేంద్రాలుగా మార్చాలని చూస్తే విద్యార్థి లోకం సహించదని హెచ్చరిస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, గొడవలు జరుగుతున్నాయంటే అందుకు కారణం బిజెపి మతోన్మాద ధోరణిని వ్యాప్తి చేసుకోవడమే కారణంగా చెప్పాలి. ప్రతి విశ్వవిద్యాయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని ప్రేరేపించే దిశగా ఎబివిపిని ప్రోత్సహించడం వల్ల ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ. ఖరగ్‌పూర్ ఐఐటి మొదలుకుని హెచ్‌సియు వరకు చాలాచోట్ల ఎబివిపి యేతర విద్యార్థి సంఘాలపై దాడులు జరుగుతున్నాయి. తనకు ఇష్టం లేకుంటే ఎలాంటి చర్యకైనా వెనుకాడని బిజెపి ప్రభుత్వం అదే పంథా కొనసాగిస్తోంది. చెన్నై ఐఐటిలో అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్‌ను తొలగించడం, ముంబయిలో ఎఫ్‌ఐటిటి ఇన్‌స్టిట్యూట్‌కు ఎలాంటి అర్హతలు లేకపోయినా గజేంద్ర చౌహన్ వంటి వ్యక్తిని నియమించడం వంటి సంఘటనలు మతోన్మాద బిజెపి పాలనకు నిదర్శనంగా భావించాలి. బిజెపి అన్ని విశ్వవిద్యాలయాల్లో తన అనుకూల విద్యార్థి సంఘమే ఉండాలనుకుని మిగిలిన విద్యార్థులపై కేసులు పెట్టి నానాగొడవ చేస్తోంది. బిజెపి విధానాలను వ్యతిరేకించే వారిని అణచివేయాలని చూస్తోంది. భావ సంఘర్షణ కేంద్రాలుగా భాసిల్లాల్సిన విశ్వవిద్యాలయాల్లో మతోన్మాద అజెండాను అమలుచేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. బిజెపి విధానాలను వ్యతిరేకించే వారిని ఏకపక్షంగా అణచివేస్తోంది. అఫ్జల్ గురుకు అనుకూలంగా కన్హయ్య నినాదాలు చేసినట్లు ఎక్కడా నిరూపించలేకపోయిన కేంద్రం ఆయనపై కేసులు మాత్రం నమోదు చేసింది. హెచ్‌సియులో రోహిత్ మృతికి విసి అప్పారావు కారణమని చాలా స్పష్టంగా వెల్లడైనా చర్యలు తీసుకోకపోగా తిరిగి విసిగా నియమించడం సిగ్గుచేటు. బిజెపి ప్రభుత్వ పోకడ వల్ల విద్యార్థులకు భవిష్యత్తులో మరింత ఇబ్బంది తప్పదు. బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం వచ్చింది.

- బి. సాంబశివ ఎస్‌ఎఫ్‌ఐ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి