ఫోకస్

ఆధిపత్య ధోరణి పనికిరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు నెలవు కావద్దు. అక్కడ రాజకీయాలు బోధించాలి, సమాజంపై అవగాహన కలిగించాలి అంతేతప్ప విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా రాజకీయాలు చేయవద్ద. రాజకీయ ప్రయోజనాల కోసం విశ్వవిద్యాలయాను ఉపయోగించుకోవద్దు. తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను సంస్కరించడానికి నడుం బిగించింది. రాష్ట్రంలో 13 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్లు లేరు. అయితే హడావుడిగా వైస్ చాన్సలర్లను నియమించడం కన్నా విశ్వవిద్యాలయాలను సంస్కరించి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఈ నియామకాలు ఉండాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. విభిన్న అభిప్రాయాలు ఉన్న విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఉండడం సహజం. ఆలోచనల మధ్య సంఘర్షణ జరగాలి. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడం తప్పు కాదు. అది ఆలోచనల పరిధిని పెంచడానికి, జ్ఞానాన్ని ప్రసాదించేందుకు, సమాజం పట్ల అవగాహన కలిగిందుకు ఉపయోగపడుతుంది. సిద్ధాంతాల మధ్య, ఆలోచన మధ్య చర్చ మంచిదే, కానీ భౌతికంగా దాడులు, ఆధిపత్యం, మా వాదనే సరైనది అనే భావన సరికాదు. విశ్వవిద్యాలయాలు సమాజానికి ఉపయోగపడే విద్యను అందించాలి. విద్యార్థులు సమాజంలో ధైర్యంగా బతికే విధంగా తీర్చిదిద్దాలి. విశాల ప్రంపచం గురించి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు అవగాహన కలిగించాలి. కానీ ఇటీవల దురదృష్టవశాత్తు కొన్ని విశ్వవిద్యాలయాల్లో అవాంచనీయ సంఘటనలు జరుగుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు, దాడులు, అరెస్టులు విశ్వవిద్యాలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో విద్యార్థుల భవిష్యత్తును సైతం ప్రమాదంలో పడేస్తున్నాయి. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి అనేది రాజకీయ ప్రయోజనాల కోణంలో కాకుండా విశాల దృక్ఫథంతో ఆలోచించాలి.

-ఎర్రోళ్ల శ్రీనివాస్, టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు