ఫోకస్

ఔన్నత్యాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్శిటీలు ఎందుకు ఉన్నాయి..?? భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే దేవాలయాలు విశ్వవిద్యాలయాలు. ఆ దేవాలయాల్లో చదువు అనే ఒక యజ్ఞం సాగాలి. విద్యార్ధులు యూనివర్శిటీల ఔన్నత్యాన్ని, వాటి లక్ష్యాలను అర్ధం చేసుకోవాలి...యూనివర్శిటీలు రాజకీయ పార్టీల వేదికలు, తమ ఇజాలకు వేదికలు కాదు...అందుకు భిన్నంగా యూనివర్శిటీలను వాడుకోవాలని ఒక వర్గం చేసే ప్రయత్నాలను మనం సమర్ధించాలా? లేదా జరుగుతున్న లోపాలను సరిదిద్ది విశ్వవిద్యాలయాలను విశ్వకళాపరిషత్‌లుగా మార్చేందుకు ప్రయత్నించాలా? వ్యక్తిగత సిద్ధాంతాలు, అభిప్రాయాలు ఎవరికి వారికి ఉండొచ్చు గాక వాటిని మనం అందరిమీదా రుద్ది , విశ్వవిద్యాలయాలను వాటికి కేంద్రంగా మార్చాలని చూడటాన్ని ఎందుకు అంగీకరించాలనే ఆలోచన నుండే వివాదాలు పుట్టుకువస్తున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగింది ఏమిటి? వైస్ ఛాన్సలర్ వసతి గృహంపై దాడి చేసింది ఎవరు? వీడియోల్లో కూడా అంతా నమోదైంది కదా..యూనివర్శిటీలో వివాదం ఎక్కడి నుండి వచ్చింది. దేశద్రోహులను దేశభక్తులుగా కొనియాడుతున్న సందర్భంలో అది తగదని వారించడంతో వచ్చింది. మనం ఎక్కడ ఉన్నాం, ఎవరిని కొలుస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చూసిన యాకుబ్‌మెమెన్ అనుచరుల విద్రోహాలను ఎంతకాలం భరించాలి యూనివర్శిటీలో ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్న సందర్భంగా కొద్ది మంది స్వార్ధశక్తులు అలజడి సృష్టించడాన్ని మేం వ్యతిరేకించడం తప్పా...హెచ్‌సియులో 5వేలకు పైగా విద్యార్ధులు ఉండగా కేవలం వంద మంది కోసం వీరంతా తరగతులకు దూరం కావల్సిందేనా? యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్‌ను శాసించాలని, యూనివర్శిటీలోకి విసిగా ఎవరు ఉండాలో నిర్ధారించాలని అనుకోవడం ఆధిపత్యపోరుకు నిదర్శనం. విద్యార్ధి సంఘం నేత రోహిత్ ఆత్మహత్యకు కారణాలపై సమగ్ర విచారణ జరగాలని వారు కూడా ఎందుకు ఇంత వరకూ డిమాండ్ చేయడం లేదు? గతంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధుల విషయంలో కూడా సమగ్ర విచారణ జరపాలని మేం కోరుతున్నాం. ఏ విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎబివిపి ఎప్పుడూ సమర్ధించదు, అలాంటి పరిస్థితులు రాకూడదని రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న ఏకైక విద్యార్ధి సంఘం ఎబివిపి, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే దానిపై పెద్ద ఎత్తున పోరు సాగించి ప్రొఫెసర్ నీరదారెడ్డి కమిటీ వేయించడానికి కారణం ఎబివిపి. హెచ్‌సియులో శృతిమించుతున్న జాతి వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రమే ఎబివిపి చెబుతోంది. హెచ్‌సియు గెస్టు హౌస్‌పై దాడులకు దిగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడాన్ని ఎబివిపి గర్హిస్తోంది. హెచ్‌సియు ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన రోజు ఆసన్నమైంది. విసి సైతం తన విద్యుక్త్ధర్మాన్ని నిర్వహించాలనే మేం కోరుకుంటున్నాం

- ఎం. రాఘవేంద్ర ఎబివిపి జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు