ఫోకస్

రాజకీయ జోక్యంవల్లే అశాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల జోక్యం అధికం కావడంవల్లే అశాంతి చోటుచేసుకుంటోంది. విశ్వవిద్యాలయాలు, అధ్యాపకులు, విద్యార్థులు సమాజంలో భాగస్వాములే. టీచర్లు, విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండాలనడంలో భిన్నాభిప్రాయం లేదు. రోజువారీ వ్యవహారాల్లో రాజకీయ పార్టీలు, నేతల జోక్యం ఉండకూడదు. యూనివర్సిటీలు విద్య, అధ్యయనం, పరిశోధనలకు కేంద్రాలుగా ఉండాలి. ప్రభుత్వం ఒక పరిమితి వరకే విశ్వవిద్యాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలి. యూనివర్సిటీలన్నీ స్వతంత్రంగా పనిచేసేందుకు ప్రభుత్వంతోపాటు రాజకీయ పార్టీలు, సమాజం కూడా అనుమతించాలి. సమాజంలో సమస్యలకు బాట చూపేందుకు యూనివర్సిటీలు ఆదర్శంగా నిలవాలి. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు విద్యార్థులను ‘ఇన్‌స్పైర్’ చేసే విధంగా పనిచేయాలి. ప్రధానంగా పరిశోధన చేసే విద్యార్థులు సామాజిక కోణంలో అధ్యయనం చేయాలి. పరిశోధకులు, పిహెచ్‌డి తీసుకునే విద్యార్థుల వల్ల, వారి పరిశోధనలవల్ల సమాజానికి ఉపయోగం ఉండాలి. సమాజం వేరు.. విద్యార్థుల పరిశోధన వేరుగా ఉండకూడదు. సమాజానికి ఉపయోగపడే అంశాలపైనే పరిశోధన చేయడంవల్ల సదరు విద్యార్థికి, సమాజానికి ఉపయోగమే కాకుండా, సంబంధిత విశ్వవిద్యాయానికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. గతంలో యూనివర్సిటీలు పవిత్రమైన దేవాలయాలుగా ఉండేవి. కుల, మతాలకు ప్రాధాన్యత ఉండేది కాదు. కేవలం విద్యపైనే విద్యార్థులు, అధ్యాపకులు దృష్టి ఉండేది. మరోరకంగా చెప్పుకోవాలంటే గతంలో యూనివర్సిటీల్లో ‘సత్యయుగం’ కొనసాగింది. రాజకీయ జోక్యం ప్రారంభమైన తర్వాత ప్రతి రాజకీయ పార్టీకి అనుబంధంగా విద్యార్థి సంఘం ఏర్పాటైంది. విద్యార్థి సంఘం ఏర్పాటు కావడం తప్పు కాదు. ఈ సంఘాలు విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రముఖులు విశ్వవిద్యాలయాలకు వెళ్లి ‘లెక్చర్లు’ ఇచ్చేవారు. విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేవారు. ఉద్యోగాలను క్రియేట్ చేసే విధంగా విద్యార్థులు రూపొందేవారు. నేడు కేవలం ఉద్యోగం సంపాదించడమే ధ్యేయంగా ఎక్కువ మంది పనిచేస్తున్నారు.
విశ్వవిద్యాయాలు స్వతంత్రంగా పనిచేసేందుకు అవసరమైన వాతావరణం, సదుపాయాలు నేడు కరవవుతున్నాయి. బోధన, బోధనేతల సిబ్బంది నియామకాలు జరగడం లేదు. ఉస్మానియా విశ్వవిద్యాయాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఈ యూనివర్సిటీల్లో గతంలో 1600 మంది టీచర్లు (పొఫెసర్లు తదితరులు) పనిచేసే వారు..ఇప్పుడు ఈ సంఖ్య 650కి తగ్గింది. అవసరమైన నిధులు యూజిసి నుండి కాని ప్రభుత్వం నుండి కాని లభించడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని విద్యాలయాల్లో వౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండటం లేదు. ఈ అంశాల్లో ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు సమాజం దృష్టి కేంద్రీకరించి, అవసరమైన చర్యలు తీసుకోవాలి. సమాజానికి దిక్సూచిగా మారేలా విశ్వవిద్యాలయాలను రూపొందించాలి.

- ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి టీచర్ల సంఘం మాజీ అధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం.