ఫోకస్

సమస్యలపై సకాలంలో స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్శిటీల్లో అలర్లు.. నివారణకు మార్గాలు యువతకు దిశా, నిర్దేశం చేయడానికి విశ్వవిద్యాలయాలు ముందంజలో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కొన్ని విశ్వవిద్యాలయాల్లో అలర్లు చోటుచేసుకోవడం శోచనీయం. విద్యార్థులకు, విశ్వవిద్యాలయ అధికారులకు మధ్య అవగాహన లోపం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడే తరగతుల నిర్వహణ, పరిశోధనలు, క్లాస్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో ఏదేని సమస్య ఉత్పన్నమైనపుడు అధికారులు సకాలంలో స్పందించాలి. అక్కడ పరిస్థితులను విద్యార్థులు అవగాహన చేసుకునే విధంగా వారికి వివరించాలి. ఆ విధంగా సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలి. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించాలి. విశ్వవిద్యాలయ అధికారులపై నమ్మకం కలిగితే సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ విశ్వవిద్యాలయ అధికారులు సకాలంలో స్పందించని సందర్భాల్లో ఆ సమస్యలు ముదిరిపాకాన పడతాయి. అందువల్లనే విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థుల్లో నమ్మకం కలిగించేలా అవసరమైన చర్యలు చేపట్టాలి. విశ్వవిద్యాలయాలు కేవలం కెపాసిటీ బిల్డింగ్‌తోపాటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కలిగించే దిశగా పయనించాలి. ఈ మధ్య కాలంలో సిబ్బంది కొరత అనేది ఒక అంశం అయితే యూనివర్శిటీల్లో అనునిత్యం పెరిగిపోతున్న వివాదాలు మరో ప్రధాన అంశంగా మారింది. విశ్వవిద్యాలయాలు ఉన్నది విద్యార్ధుల సంక్షేమం కోసం, విద్యార్ధులను ఉన్నతికి చేర్చే విద్యాబుద్ధులు నేర్పేందుకోసమే అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. విద్యార్ధులకు ఉన్న ఇబ్బందులను ఎప్పటికపుడు వర్శిటీ పాలకుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవడం తప్పు లేదు, వర్శిటీలకు ఉన్న పరిమితులను సైతం వారు గుర్తెరిగి తమ సమస్యలను ఇబ్బందులను చెప్పుకోవాలి, వాటిని సకాలంలో స్పందించి పరిష్కరించడం కూడా వర్శిటీ పాలకులపై ఉంటుంది.

- ప్రొఫెసర్ ఇ.ఎ. నారాయణ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం