ఫోకస్

అరాచకాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యాప్తంగా యూనివర్శిటీల్లో ఆందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం విచారకరం. దేశ భక్తి ముసుగులో అరాచకాలు సృష్టించవద్దు. విద్యా సంస్థలకు మతం ముసుగు వేయవద్దు. దేశ భావితరానికి పునాదులు వేసే యూనివర్శిటీల్లో ఎల్లప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యూనివర్శిటీల్లో ఏదో రకమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా రాజకీయ పార్టీలే కారణమని ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో జరిగిన సంఘటనలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. జాతీయ నాయకుల హెచ్‌సియూ సందర్శన ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. యూనివర్శిటీల యాజమాన్యం తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఎలాంటి గొడవలు, ఆందోళనలు జరుగవు. విద్యార్థుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే యూనివర్శిటీలు అల్లకల్లోలం అవుతాయి. దేశ భావితరాలకు దోహదపడే యూనివర్శిటీలు రాజకీయాలతో కలుషితం కాకూడదు. దేశానికి ఓ శాస్తవ్రేత్త, ఓ మహానేత, మేధావి సంపదను అందించే వర్శిటీలు దేవాలయాలు కావాలి తప్ప.. రాజకీయ వేదికలు కాకూడదు. మేథోసంపదను అందించే వర్శిటీల్లో కుల, మత, రాజకీయాలకతీతంగా పాలక వర్గం పనిచేయాలి.

-జగన్‌మోహన్ మెట్ల లోక్‌సత్తా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి