ఫోకస్

వర్శిటీలపై ప్రయోగాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్శిటీల ఛాన్సలర్లను, వైస్-్ఛన్సలర్లను ప్రభుత్వమే నియమించాలని భావించడం సరైంది కాదు. కొత్త ప్రయోగాలు వద్దు. మానవ వనరుల అభివృద్ధి వర్సిటీల్లో జరుగుతుంది. రిటైర్డ్ జడ్జిలనో, రిటైర్డ్ ఐఏఎస్, ఐపిఎస్‌లనో నియమించడం ద్వారా పెద్దగా ఫలితాలు ఉండవు. రిటైర్డ్ జడ్జిలను, రిటైర్డ్ ఐఏఎస్‌లను ఇక్కడ చిన్నబుచ్చడం లేదు. వారి రంగాల్లో అపూర్వమైన ఫలితాలు సాధించి ఉంటారు. కానీ వర్సిటీల్లో, విద్యా రంగాల్లో వారికి అనుభవం తక్కువగా ఉంటుంది. వర్సిటీల్లో ఉండే సీనియర్ అకాడమీషన్, విద్యావేత్తలను నియమిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. గతంలో ప్రభుత్వం ఉస్మానియా వర్సిటీ విసిగా రిటైర్డ్ జడ్జిని నియమించడం ద్వారా సాధించిన ప్రగతి శూన్యం. ఆ తర్వాత ప్రొఫెసర్ రాంరెడ్డి విసిగా నియమితులైన తర్వాత ఆయన సృష్టే ఓపెన్ యూనివర్శిటీ. దీనిని కాలక్రమేణా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్సిటీగా నామకరణం చేయడం జరిగింది. ఒక విద్యావేత్తను విసిగా నియమించడం ద్వారా ఒక సరికొత్త ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఈ విషయాన్ని మరిచిపోవద్దు. రిటైర్డ్ జడ్జినో, రిటైర్డ్ ఐపిఎస్ లేదా ఐఏఎస్‌ను నియమించడం ద్వారా వర్సిటీలో రాజకీయాలు మటుమాయమై విద్యార్థుల్లో క్రమశిక్షణ వస్తుందనేది ప్రభుత్వ ఆలోచన కావచ్చు. కానీ క్రమశిక్షణ ఒక్కటే ఉంటే సరిపోదు. సామాజిక జీవితంలో మార్పులు తీసుకుని వచ్చి వెలుగులు నింపేందుకు కృషి జరిగేది వర్శిటీల్లోనే. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీలంటేనే పరిశోధనా కేంద్రాలు. ప్రభుత్వ విధానాలపైనా చర్చ జరుగుతుంది. వర్సిటీ విద్యార్థులు కుల వివక్షలు ఉండరాదన్న సామాజిక స్పృహకోసం చర్చిస్తారు. పొలిటికల్ సైన్స్ విద్యార్థులు కూడా మంచి రాజకీయాలకోసం చర్చిస్తారు. వర్శిటీల్లో రాజకీయాలపై చర్చించరాదు అంటే పొలిటికల్ సైన్స్ విద్యార్థి చర్చించకుండా ఎలా ఉండగలరు? ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టే సంస్కరణలపై, పరిపాలనా అంశాలపై చర్చించకుండా ఎలా ఉండగలరు? అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో విద్యార్థుల జోక్యం ఉండరాదు. అదేవిధంగా వర్సిటీల్లోకి రాజకీయ పార్టీల ప్రమేయం ఉండరాదు. ఆయా పార్టీల సిద్ధాంతాలను వర్సిటీల్లోకి చొప్పించరాదు. ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేయాలి అనే అంశాలపై చర్చ జరగరాదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ప్రయోగాలు చేయకుండా ప్రస్తుతం అమలులో ఉన్న విధానానే్న కొనసాగించాలి.

- ప్రకాశ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి, బిజెపి తెలంగాణ శాఖ