ఫోకస్

కోర్టుల జోక్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన హిందూ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. భారతదేశం ఎన్నో ఏళ్ళుగా సంస్కృతి, సంప్రదాయాలతో విరాజిల్లుతున్నది. తాజాగా మహారాష్టల్రోని శని దేవాలయంలో శని విగ్రహాన్ని ముట్టుకుంటామని, పూజిస్తామని తృప్తి దేశాయ్ నేతృత్వంలో ఆందోళన చేయడం జరిగింది. శని దేవుణ్ణి పూజించరాదని ఎవరూ చెప్పలేదు. అది వివాద అంశమే కాదు. శని దేవున్ని ముట్టుకుంటామన్నదే వివాద అంశం. శనిసింగ్నాపూర్‌లోని శని దేవుణ్ణే కాదు అనేక దేవాలయాల్లో గర్బగుడిలోకి వెళ్ళేందుకు భక్తులకు అనుమతి లేదు. శివాలయాల్లో శివ లింగాన్ని ముట్టుకోవడం, శివ లింగానికి అభిషేకం చేసేందుకు, నుదురు తగిలించి మొక్కుకునేందుకు అవకాశం ఉంది. కానీ సర్వసాధారణంగా అనేక ప్రధాన దేవాలయాల్లో గర్బాలయంలోకి భక్తులు వెళ్ళేందుకు అనుమతించడం లేదు. ఎందుకంటే ఆయా దేవాలయాల్లో ఉండే నియమ, నిబంధనలే కారణం. ఈ నియమ, నిబంధనలను ఎవరో ఏర్పాటు చేసింది కాదు. పూర్వీకులు పెట్టిన ఆచారాల ప్రకారంగా అనుమతించడం లేదు. ఇలా అనాదిగా వస్తున్న పరంపరకు తిలోదకాలు ఇచ్చి, గర్బాలయంలోకి వెళతాం అనడం సరైంది కాదు. ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడం వల్ల భక్తులు అసంతృప్తికి లోనయ్యారు. కోర్టులు కూడా ఇటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదు. కోర్టులు, స్వచ్చంధ సంస్థల, ఇతరత్రా సంఘాల జోక్యం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంస్కృతి, సంప్రదాయ, ఆచార, వ్యవహారాల పరంపర కొనసాగుతుంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దేవాలయాలకు మహిళలు వెళ్ళడాన్ని ఎక్కడా నిషేధించలేదు. కొన్ని షరతులు మాత్రమే ఉన్నాయి. శబరిమలై వంటి దేవాలయాలకు బాలికలు, ముదుసలివాళ్ళు దీక్ష చేపట్టి వెళుతున్నారు. ఆ కఠినమైన 40 రోజుల దీక్షను మహిళలు ఎందుకు చేపట్టకూడదు అన్నారంటే, రుతుస్రావం వారికి అడ్డు వస్తుందనే ఉద్దేశంతోనే. కాబట్టి దీనిని గమనించి, ప్రజల, భక్తుల మనోభావాలను, మత ఆచారాలను, విశ్వాసాలను కాపాడాలి. ఈ అనవసరమైన రాద్ధాంతం, ఆందోళన చేసేవారు ఇంతటితో దీనిని నిలిపివేయాలి. ఇతర దేవాలయాల్లోకి వెళతాం, ఇలాగే చేస్తామంటూ ఆందోళనలు చేపట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదని, కించపరచారాదని విజ్ఞప్తి చేస్తున్నాను.

- గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్సీ, ఎపి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు