ఫోకస్

వివక్షకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు వివక్షకు గురవుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మహిళను గృహలక్ష్మిగా, దేవతగా, కనకదుర్గమ్మగా ఇలా రకరకాలుగా పోల్చి చెబుతుంటారు. మరి అలాంటి ఆడవాళ్లను శనిదేవుని ఆలయంలోకి అనుమతించకపోవడానికి కారణం ఏమిటో తెలీదు. నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఒకప్పుడు దళితులకు ఆలయ ప్రవేశం లేదన్నారు. వెలివేసినట్లు చూశారు. ఇప్పుడు మహిళలకు ఆలయ ప్రవేశం లేదంటున్నారు. అసలు ఒకరిని ఆలయంలోకి వెళ్లవద్దని చెప్పే అధికారం ఎవరిచ్చారు? కేరళ రాష్ట్రంలో అయ్యప్ప గుడిలోకి కూడా ఇలా మహిళలు నిషేధమన్నారు. అప్పుడు చాలా పెద్ద గొడవే జరిగింది. ఐద్వా ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమించాము. ఈ ఆలయంలోకి మహిళలు అనుమతించమని అక్కడి ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీచేశారు. తీవ్ర నిరసన రావడంతో ప్రభుత్వం దిగివచ్చి మహిళలను స్కానింగ్ చేసి లోనికి అనుమతించాలని స్పష్టం చేస్తే మళ్లీ ఉద్యమించారు. మహిళలను స్కానింగ్ తీసి లోనికి అనుమతించడమంటే ఎంత అరాచకమో దీంతో తేలింది. మళ్లీ అదే ప్రభుత్వాలు, ప్రతినిధులు మహిళలను దేవతలని, సమాన హక్కులు ఉంటాయని గొప్పగా చెబుతుంటారు. అంటే మహిళలకు ఒక గౌరవం అంటూ లేకుండా పురుషుల ప్రాధాన్యతలను బట్టి విలువ ఉంచడం లేదా తీసి వేయడం చేస్తున్నట్లు నాకు అర్థమవుతోంది. ఇది కరెక్ట్ కాదు. మహిళను దేవతగా పూజించినప్పుడు అదే మహిళలకు ఆలయాల్లో ప్రవేశం లేదని చెప్పడం ఎంత దుర్మార్గం... మహిళలను ఉన్నతమైన స్థానంలో చూడాలని కోరుకోవాలి తప్ప వివక్షతో చూసే సంప్రదాయాన్ని విడనాడాలి.

- కె.ఎన్.ఆశాలత, ఐద్వా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు.