ఫోకస్

ఆచార వ్యవహారాల్లో కోర్టుల ప్రమేయమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం లౌకిక రాజ్యం. అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. మతాలపై పెత్తనం వహించేందుకు రాజ్యాంగంలోని మూడు స్తంభాలకు (లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ) కూడా అధికారం లేదు. మత సంస్థల పరిపాలనాపరమైన నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. ఎక్కడైనా చట్టానికి విరుద్ధంగా పరిపాలనాపరమైన కార్యక్రమాలు జరిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. చట్టంప్రకారం పరిపాలనా అంశం ఒకటైతే, ఆచార వ్యవహారాలు రెండో అంశం. అనేక సందర్భాలలో మన కోర్టులు హిందూమతానికి సంబంధించి అనేక పర్యాయాలు సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాయి. శనిసింగనాపూర్ ఆలయంలో మహిళలకు ప్రవేశం లేకుండా ఒక నిబంధనను ఆ ఆలయం నిర్వహకులు పెట్టుకున్నారు. 400 సంవత్సరాల నుండి ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే 2011 లో శింగనాపూర్‌లోని శని ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ సంబంధిత ఆలయ పాలకమండలి నిర్ణయం తీసుకున్నది. ఆలయంలో శనిదేవుడి విగ్రహం ఒక ప్లాట్‌ఫాంపై ఉంది. ఈ ప్లాట్‌ఫాంపైకి ఎక్కి పూజలు చేసేందుకు పురుషులకు అవకాశం ఉంది. కాని మహిళలకు మాత్రం ప్లాట్‌ఫాంపైకి ఎక్కేందుకు అవకాశం కల్పించలేదు. ఇది ఆచారంగా వస్తోంది. ఇప్పుడు బొంబాయి హైకోర్టు ఇద్దరు వ్యక్తులు వేసిన ఒక ‘పిల్’పై స్పందించి, మహారాష్ట్ర దేవాలయాల చట్టం ప్రకారం ఏ దేవాలయంలోకైనా ఎవరైనా ప్రవేశించేందుకు, ప్లాట్‌ఫాంపైకి ఎక్కి దేవుడిని పూజించేందుకు మహిళలకు వీలుందని, ఎవరైనా అలా అడ్డుకుంటే వారికి ఆరునెలల జైలు శిక్ష విధించేందుకు వీలుందని గుర్తుచేసింది. హిందూదేవాలయాలు హిందూమతానికి సంబంధించినవి. అనేక ఆలయాల్లో సొంతంగా కొన్ని ఆచార, వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ మూలస్తంభాలతోపాటు సమాజంలోని అందరిపై ఉంటుంది. మసీదులోకి ముస్లిం మహిళలను ఎందుకు అనుమతించడం లేదు అన్న ప్రశ్న ఈ సందర్భంగా వస్తుంది కదా! పురుషులతోపాటు మహిళలకు సమాన ప్రాధాన్యత ఇస్తే, మసీదులో ప్రార్థన చేసుకునేందుకు మహిళలకు కూడా అవకాశం ఉండాలి కదా! కాని ముస్లింల ఆచార వ్యవహారాలు మహిళలను మసీదులోకి వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఈ ఆచారాన్ని ఎవరైనా కాదని మహిళలను మసీదులోకి వెళ్లనిస్తారా? అలాగే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కాని, ఇతర ప్రముఖ ఆలయాలకు కాని జడ్జిలతోసహా ప్రముఖులు వెళ్లినప్పుడు సామాన్యభక్తులకు భిన్నంగా గౌరవం ఇస్తున్నారా లేదా? సాంప్రదాయమన్నా, ఆచారమన్నా ఇదే మరి! కార్మిక చట్టం ప్రకారం పురుషులకు రోజు కూలీ 250 రూపాయలు ఇస్తుంటే, మహిళలకు 200 రూపాయలు ఇస్తున్నారా లేదా? పని ఒకటే అయినప్పుడు మహిళలకు తక్కువ వేతనం ఎలా ఇస్తున్నారు? ఇందుకు చట్టం ఎలా ఒప్పుకుంటోంది? అన్న ప్రశ్నలు మనలో వస్తున్నాయి కదా? అలాగే మతపరమైన అంశాలపై కేసులు నమోదైతే హిందూసాంప్రదాయాలు, ఆచారాలు, ఆయా ఆలయాల్లో నియమ, నిబంధనలను గుర్తుంచుకుని ఆదేశాలు జారీ చేయడం మంచిది. ఒక మతానికి సంబంధించిన ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు.

- సి.ఎస్. రంగరాజన్ అర్చకులు, చిలుకూరు బాలాజీ ఆలయం.