ఫోకస్

విద్యారంగం గాడిలో పడేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం క్రాస్‌రోడ్స్‌లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌కెజి నుండి పిజి వరకూ ఉచిత విద్యను అందించే ప్రయత్నం జరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో సైతం దాదాపు అదేలైన్‌లో మోడల్‌స్కూళ్లను పెద్దఎత్తున ప్రారంభించి ఉచిత విద్యను అందించే కృషి మొదలైంది. ప్రస్తుతం పాఠశాల విద్యలో 80 శాతం మందికి ఉచితంగానే విద్య అందుతోంది, పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఉచితంగానే ఇస్తున్నారు. మధ్యాహ్న భోజనం పెడుతున్నారు, ఉన్నత విద్యలో 65 శాతం మందికి ఉచితంగానే విద్య అందుతోంది. రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ, జూనియర్ కాలేజీల్లోనూ ఉచితంగానే విద్య అందుతోంది. బడుగు బలహీనవర్గాల వారికి పుస్తకాలు ఉచితమే, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బుక్ బ్యాంకులు ఉన్నాయి, మరోపక్క హాస్టళ్లలో భోజన వసతి సౌకర్యాలున్నాయి. ఉపాధ్యాయులకు జీతాలు గరిష్ఠంగా చెల్లిస్తున్నా, ఎప్పటికప్పుడు పదోన్నతులు కల్పిస్తున్నా, విద్యార్థులకు సదుపాయాలు ఇస్తున్నా అనుకున్న ఫలితాలను మాత్రం సాధించడం లేదు. దీనికి అంతా అనేక సాకులు, కారణాలు, పరిస్థితులు చెబుతుంటారు. సొంత భవనాలు లేవని, సరిపడా సిబ్బంది లేరని, ఆటస్థలాలు, ఆట పరికరాలు లేవని, వౌలిక వసతులు లేవని, మంచినీటి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, ఇంటర్‌నెట్ సౌకర్యం లేదని, మరుగుదొడ్లు లేవని, కాంపౌండ్ వాల్ లేదని.. ఇలా వారు చెప్పే కారణాలకు లెక్కేలేదు. మొత్తం మీద విద్యారంగంలో ఏదో లోపం కనిపిస్తోంది. ఎక్కడో లోపం ఉంది. అయినా ఈ లోపాలను సరిదిద్దేందుకు, పెద్దఎత్తున విద్యాభివృద్ధికి ఇరు రాష్ట్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పాఠశాలలు మొదలు ఉన్నత విద్యాసంస్థలైన యూనివర్శిటీల వరకూ అనేక వివాదాలు చెలరేగుతున్నాయి. విద్యార్థుల ఘర్షణలు, రాజకీయాలతో అట్టుడికిపోతున్నాయి. అడ్మిషన్లు, ప్రవేశపరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యారంగం సంక్షోభంలో పడింది. ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రం ప్రభుత్వం నుండి కోట్లాది రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయని వాదిస్తున్నాయి. బకాయిలు చెల్లించనిదే తాము విద్యాసంస్థలను నడపలేమని చెబుతున్నాయి. ఇంకోపక్క ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాకంపై తల్లిదండ్రులు, విద్యార్థులు మండిపడుతున్నారు. అడ్మిషన్లు, ఫీజుల విషయంలో ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. ఎవరిమాటా లక్ష్య పెట్టడం లేదని, నియమ నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని గాడిలో పెట్టాలి, దానిని సన్మార్గంలో పెట్టాలి. ఈ క్రమంలో విద్యారంగం ప్రక్షాళనకు నిపుణుల అభిప్రాయాలు ఈ వారం ఫోకస్‌లో.