ఫోకస్

ఒత్తిళ్లకు లొంగవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టే విషయంలో ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో వ్యవహరించాలి. ఎవరి వత్తిళ్లకు లొంగకుండా ప్రభుత్వం వీటిపై ఉక్కుపాదం మోపాలి. డబ్బులు దండుకోవడం మినహా ఇతరత్రా విద్యార్థుల బాగోగులు ఎంతమాత్రం పట్టని ప్రైవేట్ విద్యాసంస్థలను ఇప్పటికైనా ఒక దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ను కాజేయడం కోసమే కొన్ని విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ఫీజు రియింబర్స్‌మెంట్ పొందుతున్న కళాశాలలు నిబంధనల మేరకు పని చేస్తున్నాయా? స్కాలర్‌షిప్ పొందిన విద్యార్థి అందుకు అర్హుడా.. కాదా? అని తప్పకుండా పరిశీలన జరపాల్సిందే. అలాగే కళాశాలలో సంబంధిత కోర్స్, విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారా.. లేదా? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫీజు రియింబర్స్‌మెంట్ పొందుతున్న విద్యార్థులకు కనీస హాజరు ఉందా.. లేదా? అనే కోణంలో కూడా పరిశీలించాలి. ప్రభుత్వం నుంచి లక్షలు, కోట్లు ఫీజు రియింబర్స్‌మెంట్ పొందుతున్న కళాశాలలు అందుకు అర్హమైనవా.. కావా? అని తనిఖీ చేయాల్సిన బాధ్యత, అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీనిని ప్రశ్నించే అధికారం కానీ, నిరాకరించే అధికారం కానీ ప్రైవేట్ విద్యాసంస్థలకు ఉండదు. తమ అక్రమాలు ఎక్కడ బయట పడతాయోనన్న భయంతోనే కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ కళాశాలలు తమపై దాడులు చేయవద్దని డిమాండ్ చేయడంలోనే వారు అక్రమాలకు పాల్పడుతున్నట్టు పరోక్షంగా బహిర్గతం అయింది.
- దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్
చైర్మన్, తెలంగాణ స్టూడెంట్ జెఎసి,
ఒయు జెఎసి