ఫోకస్

నివారణ చర్యలు శూన్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరవు కోరల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. కరవు అంచనా, కరవు మండలాల ప్రకటన, కేంద్రం నుంచి సహాయం పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇంతగా కరవు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా రాజకీయ క్రీడలకు పాల్పడుతున్నది. కరవు నివారణకు చర్యలు చేపట్టకుండా, ప్రతిపక్షాలను అణచి వేయడమే పనిగా పెట్టుకున్నది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలే లేకుండా చేయాలన్న కుట్ర చేస్తోంది. తెలుగుదేశం పార్టీ 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే చివరకు ముగ్గురు మిగిలారు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు దృష్టి సారించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలను టిఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఒక పార్టీ తరువాత మరో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులను చేర్చుకోవడంలో నిమగ్నమైంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే రాజకీయ పునరేకీకరణ అవుతుందా? రాష్ట్ర ప్రజలు ఈ చర్యలను హర్షించరన్న విషయాన్ని పాలకులు తెలుసుకోవాలి. కరవు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో టిఆర్‌ఎస్ ప్లీనరీ నిర్వహించింది. కరవు దృష్ట్యా ప్లీనరీ వాయిదా వేసుకోవాల్సిందిగా మేము కోరితే, టిఆర్‌ఎస్ మరింత పట్టుదలకు పోయి ఖమ్మం జిల్లాలోనే నిర్వహించి అనైతికతను చాటుకున్నది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్నందున, ప్లీనరీని అక్కడ నిర్వహించింది. టిఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఇన్ని తిప్పలు ఎందుకు పడుతున్నది. కరవు సమయంలో ప్లీనరీ ఎందుకు? పైగా ఖమ్మంలోనే నిర్వహించాలని ఏముంది? అందునా రాష్ట్ర మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావునే ఎందుకు పోటీకి దించుతున్నట్లు? తుమ్మల ఎమ్మెల్సీగా ఉన్నా, ఆయనే్న ఎందుకు బరిలోకి దించారు?
కరవు నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశం మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల స్థాయినుంచి రాష్టస్థ్రాయి వరకు ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దగ్దం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని కరవు నివారణకు చర్యలు చేపట్టాలి. రైతులు వలస వెళ్ళకుండా చూడండి, రైతులు కూలీలుగా మారకుండా చూడండి. పశువులకు పశుగ్రాసం అందించాలి. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతిపక్షాలనూ కలుపుకుని పోవాలి.

- ఎం. కోదండ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిసాన్ ఖేత్ కాంగ్రెస్ అధ్యక్షుడు