ఫోకస్

ప్రాంతీయ భావన తొలగిపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నీట్’తో నా రాష్ట్రం, మా రాష్ట్రం అనే ప్రాంతీయ భావన తొలగిపోతుంది. దేశంలో అందరిదీ ఒకే భావన కలుగుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ అనేది మంచిదే.. కానీ కొంత గడువు ఇస్తే బాగుండేది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికులు తెలుగు భాషకే అలవాటుపడి ఉన్నారు. నీట్‌కు ఆంగ్లం, హిందీ భాషలు అవసరం. కాబట్టి కొంత గడువు ఇస్తే రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు వెసలుబాటు ఉంటుంది. నీట్‌పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి ఒక నెల రోజులే అవుతుంది. ఇప్పటికిప్పుడు అభ్యర్థులు ప్రిపేర్ కావాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్కరు ఒక పద్ధతిలో నిర్వహించుకునే పరీక్షలకు బదులు దేశవ్యాప్తంగా ఒకే విధానంలో ఉండడం మంచిదే. కానీ ఒక సంవత్సరంపాటు గడువు ఇస్తే రెండు రాష్ట్రాల్లోనూ అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి వీలుంటుంది. నీట్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించే ఒకే పద్ధతి ద్వారా తెలుగు రాష్ట్రాలకు లభించే 85 శాతం సీట్లు యథాతథంగా ఉంటాయి. కాకపోతే 15 శాతం నష్టపోకుండా ఉండాలంటే కొంత గడువు ఇస్తే బాగుంటుంది. ప్రైవేటు విద్యా సంస్థలు మెడికల్ సీటుకోసం సుమారు 10 నుంచి 20 టెస్టులు నిర్వహిస్తారు. దీంతో అభ్యర్థులు పరీక్షలకు కేటాయించాల్సిన సమయంతోపాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రైవేటు విద్యా సంస్థలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంతో నిర్వహిస్తున్న పరీక్షలను పోల్చుకుంటే దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు పరచడంలో తప్పులేదు. సెంట్రల్ సెలబస్‌తో కూడిన పరీక్షలు కాబట్టి కొంత గడువు అవసరం. దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఒక ఏడాది పాటు గడువు ఇస్తూ ‘నీట్’ను అమలుపరుస్తే బాగుంటుంది.

- రాజారెడ్డి నేషనల్ ఫైనాన్స్ కమిటీ చైర్ పర్సన్, లోక్‌సత్తా