ఫోకస్

ముందుగా విద్యావ్యవస్థ పటిష్ఠం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ వ్యాప్తంగా ఒకే రకమైన ప్రవేశ పరీక్ష ద్వారా వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేయాలనుకుకోవడం మంచి ఆలోచనే. కానీ ఆ రకంగా చేసే ముందు మన దేశంలో విద్యావ్యవస్థ ఎలా ఉందనే కోణంలో సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంది. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో విద్యావ్యవస్థ సమానంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే జాతీయ స్థాయిలో ఏదైనా ఒకే ప్రవేశ పరీక్ష ఉంటే అందరూ హర్షిస్తారు. గతంలో కూడా ఇదే ‘నీట్’ పరీక్ష అంశంపై తమ పార్టీ తరఫు అభిప్రాయం స్పష్టంగా చెప్పాము. అనుకున్న విధానం మంచిదే, కానీ ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని పరిష్కరించిన తర్వాత చేపడితే మంచిదని చెప్పాము. కానీ కేంద్రప్రభుత్వం వినలేదు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వైద్య సీట్ల భర్తీ విధానం అమల్లో ఉండి ఒక్కో పద్దతిలో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుటికిప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష అంటే విద్యార్థులకు కష్టమవుతుంది. వైద్య విద్య సీట్ల భర్తీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీనికి చెక్‌పెట్టేందుకు కేంద్రం ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించాలని భావించింది. అసలు విద్యారంగంలో అభివృద్ధి విషయానికొస్తే కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉంటే, మరికొన్ని చోట్ల అసలు అభివృద్ధే లేదు. ఈ పరిస్థితిలో ప్రైవేటు, కార్పొరేట్ రంగంలో ఉన్న విద్యాసంస్థల విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో సైతం విజయం సాధించగలుగుతున్నారు. కానీ విద్యలో వెనుకబడిన మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించడం వల్ల హిందీ, ఇంగ్లీషుపై పట్టులేక చాలా రాష్ట్రాల్లోని అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జాతీయ స్థాయి ప్రవేశపరీక్షను స్థానిక భాషలో రాసేందుకు వీలు కల్పించాలి. భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్న చోట హిందీ భాష అందరికీ రాదు. స్ధానిక భాషలో నీట్ రాసేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉన్న సీట్లకు ఆ రాష్ట్ర విద్యార్థులనే అర్హులను చేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బిసి, ఒబిసి తదితరు రిజర్వేషన్లను పాటించాలి. అలాగైతేనే అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. పునాదులు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని అనుకున్నట్లు, విద్యావ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రవేశపరీక్షలకు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కేంద్రప్రభుత్వ పాలసీ కరక్టే అయినప్పటికీ విద్య విషయంలో యూనివర్శల్ డెవలెప్‌మెంట్ ఉంటేనే సాధ్యపడుతుంది.

- కె.నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి