ఫోకస్

‘నీట్’ దారి చూపేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్ది రాష్ట్రాల్లో మెడికల్ అడ్మిషన్లకు అఖిల భారత ప్రీ మెడికల్, ప్రీ డెంటల్ పరీక్ష నిర్వహిస్తున్న తరుణంలో జాతీయస్థాయిలో 15 శాతం ఓపెన్ కోటాకోసం ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలనే ఆలోచనలోంచి పుట్టిందే నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్). యుజి కోర్సులకు ఒక నీట్, పిజి కోర్సులకు మరో నీట్ నిర్వహించాలని 2011లో నిర్ణయించారు. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా నీట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఏడాది తిరగకుండానే నీట్ నిర్వహణ అధికారం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేదని, కేవలం వౌలిక సదుపాయాలు పర్యవేక్షించాల్సిన సంస్థకు నీట్‌పై హక్కు లేదని పేర్కొంటూ పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు కేసులు దాఖలు చేయడంతో అప్పటి సుప్రీంకోర్టు ధర్మాసనం నీట్ నిర్వహణను నిలిపివేసింది. దాంతో మరోమారు అఖిల భారత ప్రీ మెడికల్, ప్రీ డెంటల్ పరీక్ష (ఎఐపిఎంటి) తెరమీదకు వచ్చింది. గత కొద్ది సంవత్సరాలుగా ఎఐపిఎంటి నిర్వహించి కొన్ని రాష్ట్రాల్లో మెడికల్, డెంటల్ సీట్ల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఒక ఎన్‌జిఓ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం జాతీయ స్థాయిలో ఏకీకృత ప్రవేశపరీక్ష - నీట్‌ను నిర్వహించాల్సిందేనని ఆదేశించింది. ఈ ఆదేశాలు వచ్చేసరికి పలు రాష్ట్రాల్లో మెడికల్ ప్రవేశ పరీక్షలు జరిగిపోయాయి. కొన్ని రాష్ట్రాల్లో హాల్‌టిక్కెట్లను జారీ చేశారు. సుప్రీంకోర్టు తమ ఆదేశాలను పునరాలోచించాలని పలు యాజమాన్యాలు, విద్యార్ధులు కోరినా పున:పరిశీలనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎఐపిఎంటిని తొలి దశ నీట్‌గా పరిగణించి పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఆ మేరకు సిబిఎస్‌ఇ తొలి దశ నీట్‌ను పూర్తి చేసింది. ఇక మలి దశ నీట్‌ను జూలై 24న నిర్వహించాలని అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెలలో జారీ చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు పరీక్షల ఫలితాలను ఒకే మారు ఆగస్టు 17న ప్రకటించి, సెప్టెంబర్‌లో అడ్మిషన్లు పూర్తి చేయాలని, అక్టోబర్ 1 నుండి తరగతులు ప్రారంభించాలని కూడా సిబిఎస్‌ఇని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతవరకూ స్పష్టత ఉన్నా ఇప్పటికే రాష్ట్రాల్లో నిర్వహించిన వివిధ ఉమ్మడి ప్రవేశపరీక్షల భవితవ్యం ప్రశ్నార్థకం అయింది. వాటిని ఏం చేయాలో అర్థంకాని అయోమయంలో పలు రాష్ట్రాలు ఉన్నాయి. నీట్‌తోపాటు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్షల చెల్లుబాటుపై కూడా విద్యార్థుల్లో అనేక అనుమానాలున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సింది సుప్రీంకోర్టు మాత్రమే. గతంలో నీట్ నిర్వహించినపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 370డి క్లాజు కింద ప్రత్యేక హోదాలో నీట్‌లో చేరలేదని కనుక ఇపుడు కూడా నీట్ వర్తించదనే వాదనలున్నాయి, ఇటీవలె కేంద్ర కుటుంబ సంక్షేమ మంత్రి మాత్రం నీట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.