ఫోకస్

తల్లిదండ్రుల ఆలోచనలూ మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు, ఐటి రంగంలో ఉద్యోగులు, కార్పొరేట్ దిగ్గజాలు, ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల జీవితాలు చెడుకోణంలో బహిర్గతమవుతున్న సంఘటనలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. దీనికి కారణం చిన్నప్పటి నుండి ఆడంబర జీవితాలు గడపాలనే ఆకాంక్ష, వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం, నీతివంతమైన చదువులు చదవకపోవడం, తప్పుడుదారుల్లో డబ్బు సంపాదించాలన్న తాపత్రయం కారణం. 30 ఏళ్ల క్రితం పాఠశాలల్లో పిల్లలకు సుమతి శతకం, దాశరథి శతకం, వేమన శతకం పద్యాలను చెప్పేవారు. పిల్లలు వాటిని వల్లెవేసేవారు. కౌమార దశ, యవ్వన దశలో తప్పులు చేస్తే దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో ఈ శతకాల్లో చక్కగా వందల సంవత్సరాల క్రితమే చెప్పేవారు. మహాభారతం, రామాయణం, భాగవతంలోని కథలు పిల్లల హృదయాలను హత్తుకునే విధంగా ఉపాధ్యాయులు చెప్పేవారు. ఇప్పుడా చదువులు ఉన్నాయా? పిల్లలు పుట్టిన వెంటనే కార్పొరేట్ కానె్వంట్లలో సీటు వస్తుందా? ఐదవ తరగతి పాసైన వెంటనే ఐఐటి, మెడిసెన్ లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించగలమా? తల్లితండ్రులకు ఇదే ధ్యాస. ఇంటర్ అయిన వెంటనే ఐఐటి చదవాల్సిందే. ఎంతసేపు చిన్న వయస్సులోనే తమ పిల్లలు సెటిల్ కావాలి. లక్షల రూపాయలు సంపాదించాలనే ఆశ పెరిగింది. పిల్లల అభిరుచులను తల్లితండ్రులు పట్టించుకోవడం లేదు. ఈ పోటీ ప్రపంచంలో చదివిన పిల్లలు సెటిలైన తర్వాత పక్కదారి పడుతున్నారు. యువకులు, యువతులు ఆధునిక జీవితంలో వ్యసనాలకు బానిసలవుతున్నారు. మానవ సంబంధాలు డబ్బుకు పరిమితమవుతున్నాయి. విలాసవంతమైన జీవనంకోసం అన్ని రకాల సంస్కారాన్ని, మానవత్వాన్ని, సంబంధాలను తెంపుకుంటున్నారు. ‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’ అందుకే నీతి విద్యకు పెద్దపీట వేయాలి. ఈ రోజుల్లో పిల్లలకు మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, బాబాయ్ అనే పదాలు తెలుసా? అంకుల్ కల్చర్ పెరిగింది. ఆధునిక జీవితం, అత్యంత ఆధునిక టెక్నాలజీ చేతిలోకి వచ్చేసరికి పక్కన ఉన్న వ్యక్తులతో మాట్లాడడం మానివేశాం. దీనివల్ల మంచి-చెడుకు మధ్య ఉన్న తేడా గుర్తించలేక యువత నాశనమవుతుంది. అందుకే బ్యాక్ టు బేసిక్స్ అంటే మూలాల్లోకి వెళ్లాలి. పాఠశాల నుంచి కాలేజీ స్థాయి వరకు భారతీయ సంస్కృతి, నీతి విద్యను తప్పనిసరి చేయాలి. ఇందుకు ఉపాధ్యాయులు, తల్లితండ్రులు నడుం బిగించాలి.

- ఎస్ సలాం బాబు, అధ్యక్షుడు, ఏపి వైకాపా విద్యార్థి సంఘం