ఫోకస్

వైద్య విద్యా వ్యాపారాన్ని అరికట్టవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెడికల్ ఎడ్యుకేషన్ కోర్స్‌ల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఎంట్రెన్స్ టెస్ట్ ‘నీట్’ ఉండాలని అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను స్వాగతించాల్సిందే. వైద్య విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కళాశాల ఆగడాలకు నీట్‌వల్ల తెరదించవచ్చు. వైద్య కోర్స్‌ల్లో యూనిఫామిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిఫామిటీ ఆఫ్ సిలబస్, యూనిఫామిటీ ఆఫ్ స్టాండర్డు నీట్ వల్లనే సాధ్యం అవుతుంది. గతంలో ఇంటర్మీడియట్ నుంచి పూర్తిగా ప్రభుత్వ కళాశాలల్లోనే బోధన జరిగేది. కానీ కాలక్రమేణ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ విద్యను కబళించి హస్తగతం చేసుకున్నాయి. ఇంటర్‌లో వచ్చిన మార్కులు వైద్య విద్యా కోర్స్‌ల్లో వెయిటేజిగా మారడంతో దీనిని కార్పొరేట్ విద్యా సంస్థలు అవినీతిమయంగా మార్చేశాయి. దీంతో వైద్య విద్య వ్యాపారంగా మారిపోయింది. ఈ పరిణామాలకు ఎక్కడో ఒకచోట ముకుతాడు వేయాలంటే ‘నీట్’ వల్లనే అది సాధ్యం అవుతుంది.

- డాక్టర్ రాజ్ సిద్ధార్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్