ఫోకస్

తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారికి నీట్ వల్ల నష్టమే జరుగుతుందని చెప్పాలి. నీట్ ఏర్పాటు చేయడం అనేది తాత్కాలిక నిర్ణయమైనా, శాశ్వత నిర్ణయమైనా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు పెద్ద శాపంగానే చెప్పాలి. ఇప్పటికే వైద్య విద్యలో ప్రవేశానికి రాష్ట్రాలు పెట్టే ఎంసెట్ పరీక్షకు లక్షలు గుమ్మరించి ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషన్ కాస్త నీట్ ప్రకటనతో నీరుగారిపోయింది. విద్యార్థులకు కోచింగ్‌ల పేరిట డబ్బుకు డబ్బు వృధా అయ్యింది. చాలా సమయం కూడా కోల్పోవలసి వచ్చింది. ఇప్పుడు నీట్ రాస్తే సీటు వస్తుందో రాదో తెలియక మానసికంగా ఆందోళనకు గురికావాల్సి వస్తోంది. ఇక నీట్‌కోసం కోచింగ్‌ల పేరిట దండుకునేందుకు అనేక సంస్థలు, కోచింగ్ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థులు మళ్లీ నీట్‌కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం రెండేళ్ల నుంచి నీట్ అంశం నలుగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా పట్టించుకోలేదు. ఇప్పుడు తప్పనిసరి అని చెప్పడంతో రకరకాల కారణాలు చెబుతున్నాయి. ఇబ్బంది ప్రభుత్వాలకు రాలేదు, విద్యార్థులకు వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు, తెలుగు మీడియం విద్యార్థులకు నీట్ పరీక్ష ఒక శిక్షగా ఉంది. ఈ శిక్ష ఏదో ప్రభుత్వాలకు వేస్తే బాగుంటుంది. నీట్ పరీక్షకు అనుగుణంగా ఇంటర్ విద్యలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. పాతపద్దతి ప్రకారం నీట్‌కు హాజరైతే ఎవరూ పాసయ్యే అవకాశం లేదు. నీట్ పరీక్షను మరో ఏడాది తర్వాత అమలు చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ ఏడాది అందుకు అనుగుణంగా కళాశాలలు తమ సిలబస్, ప్రిపరేషన్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. అయితే నీట్ ప్రవేశపెట్టినా మన సీట్లు మనకే ఉండాలి తప్ప మరొకరికి కేటాయించడం సరికాదు. అంతేకాకుండా 371డి ఆర్టికల్ ప్రకారం తెలుగు రాష్ట్రాలకు కేటాయించబడిన సీట్లను విధిగా వారికే ఇవ్వాలి. మరొకరికి కేటాయిస్తే తప్పవుతుంది. సిబిఎస్‌ఇ కోర్సు చదివే విద్యార్థులు, విదేశీ విద్యార్థులకు నీట్ పరీక్ష బాగానే ఉంటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మాత్రం నీట్ పరీక్ష విషమ పరీక్షగా మారుతుంది. ఈ పరీక్ష రాసేందుకు తగిన ప్రిపరేషన్ కావాలంటే కొన్నాళ్లు పడుతుంది. అయితే ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమై, కొన్ని రాష్ట్రాల్లో ప్రవేశ పరీక్షలు జరిగినందున ఈ దశలో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవమేనని చెప్పాలి.

- నూర్ మహ్మద్ ఎస్‌ఎఫ్‌ఐ, ఎపి రాష్ట్ర కార్యదర్శి