ఫోకస్

మనకు లాభమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యవిద్యకు సంబంధించి జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలిటీ-కం-ఎంట్రన్స్ టెస్ట్) వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు లాభమే చేకూరుతుంది. తెలంగాణ, ఎపికి చెందిన విద్యార్థులు మెడిసిన్, ఇంజనీరింగ్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. నీట్‌లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఎంసెట్‌కు నీట్‌కు కొంత తేడా ఉంది. ఎంసెట్‌లో పరిక్షా విధానం ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ఒక ప్రశ్నకు నాలుగు జవాబులు ఇచ్చి సరైన జవాబు ఏదో రాయాల్సి ఉంటుంది. నీట్‌లో అలా కాదు.. కానె్సప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. సిబిఎస్‌ఇ పరీక్షలు కూడా అలాగే ఉంటాయి. అందుకే మెడిసిన్ సీట్లను భర్తీ చేసేందుకు సిబిఎస్‌ఇ నిర్వహించే పరీక్షలు కూడా కానె్సప్ట్ ఓరియెంటెడ్‌గానే ఉంటాయి. అయినప్పటికీ, తెలుగు విద్యార్థులు కానె్సప్ట్ ఓరియంటెడ్ విధానంలో కూడా ప్రతిభ కనబరచి, ఎక్కువ మొత్తంలో సీట్లను దక్కించుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే చాలా సంవత్సరాల నుండి ఎంసెట్ పరీక్షా విధానానికి అలవాటు పడ్డ విద్యార్థులు ఆల్ ఆఫ్ సడెన్‌గా కానె్సప్ట్ ఓరియంటెడ్ విధానానికి రావడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎనిమిదో తరగతి నుండే విద్యార్థులు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఎంసెట్ పరిక్షా విధానానికి అలవాటు పడ్డారు. కార్పొరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్లు కూడా ఇదే విధానంలో శిక్షణ ఇస్తూ వస్తున్నాయి. సిబిఎస్‌ఇ విధానంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కనీసం ఒక ఏడాది పాటైనా సమయం అవసరం ఉంటుంది. అందుకే ఈ ఒక్క సంవత్సరం ఎంసెట్ విధానంలోనే పరీక్షలు నిర్వహించి, తర్వాత సంవత్సరానికి నీట్‌కు వెళ్లితే బాగుంటుంది. ఈ అంశానే్న మనం సుప్రీంకోర్టుకు తెలియచేసాం. సుప్రీంకోర్టు మన రాష్ట్ర ప్రభుత్వ వాదనను అంగీకరిస్తే, ఒక సంవత్సరానికి నీట్ నుండి మినహాయింపు లభిస్తుంది. పైగా 371-డి అధికరణం కూడా అడ్డువస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఎంబిబిఎస్ సీట్లు వెయ్యి వరకు అందుబాటులో ఉన్నాయి. జాతీయ స్థాయిలో (నీట్)లో చేరడంవల్ల మూడువేల వరకు అందుబాటులోకి వస్తాయి. పిజి సీట్లు మన రాష్ట్రంలో 551 ఉండగా, జాతీయ స్థాయిలో 5400 వరకు అందుబాటులో ఉంటాయి. 15 సీట్లకు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పోటీపడ్డా, మన విద్యార్థుల ముందు నిలవడం క్లిష్టంగానే ఉంటుంది. మెరిట్‌కే నీట్‌లో ప్రాధాన్యత ఉంటుంది. అందువల్ల తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు లాభదాయకంగానే ఉంటుందనడంలో సందేహం లేదు. వచ్చే సంవత్సర వరకు మన విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చి నీట్‌కు సిద్ధం చేయవచ్చు.

- డాక్టర్ ఎం. రమణి డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ప్రభుత్వం