ఫోకస్

తెలంగాణకు నష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య విద్యా సంస్థల ప్రవేశ పరీక్ష ఇప్పటికప్పుడు నీట్ ద్వారా నిర్వహించడం వల్ల తెలంగాణకు నష్టం. కనీసం ఒక రెండేళ్ల సమయం ఇచ్చి ఈ నిర్ణయం అమలు చేస్తే బాగుటుంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంసెట్ కోణంలో చదువుకున్నారు. నగరాల్లో కొద్ది మంది మాత్రమే సెంట్రల్ సిలబస్‌లో చదువుకున్న వారు ఉంటారు. వారికి నీట్ ఉపయోగపడుతుంది కానీ గ్రామీణ ప్రాంతం వారికి ఉపయోగడదు. ఇదో సమస్య అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో 371 డి అమలులో ఉంది. ఈ నిబంధన ప్రకారం స్థానికులకే ఇక్కడి విద్యా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. దేశంలోని ఇతర మెడికల్ కాలేజీల్లో తెలంగాణ వారికి, అదే విధంగా తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో ఇతర రాష్ట్రాల వారిని చేర్చుకోవాలంటే 371డిని సవరిస్తే పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలి. అది చేయకుండా అమలు చేయడం ఎలా సాధ్యం అవుతుంది. ఎంసెట్ పరీక్షల కోసం ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థులు సిద్ధమవుతున్నారు. కనీసం రెండేళ్ల పాటు విద్యార్థులు పూర్తిగా ఎంసెట్ కోణంతోనే చదువుతారు. కానీ ఇప్పుడు ఎంసెట్ కోణంలో చదివి నీట్ రాయమంటే విద్యార్థులు ఆందోళన చెందుతారు. నీట్ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ రూపొందించాలి. వాటిని చదువుకున్న విద్యార్థులు పరీక్షలు రాయాలి అంటే కనీసం ఇంకా రెండేళ్ల గడువు అవసరం. దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశానికి ఒకే విధమైన ప్రవేశపరీక్ష నిర్వహించాలనే ఉద్దేశం మంచిదే, అయితే దానికి ముందుగా రాష్ట్రాలను సన్నద్ధం చేయాలి. రెండేళ్ల తరువాత నీట్ అమలులోకి వస్తుంది అని ప్రకటిస్తే విద్యార్థులకు మేలు. నీట్ ద్వారానే వైద్య విద్యాలయాల్లో ప్రవేశాలు అని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ అంశంపై రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. రెండేళ్ల గడువు కావాలనే తెలంగాణ తన వాదన వినిపించింది. ఇప్పటికిప్పుడు నీట్ ద్వారా నిర్వహిస్తే తలెత్తే సమస్యలను కేంద్రం దృష్టికి తెలంగాణ తీసుకు వెళ్లింది. విద్యార్థులకు మేలు జరిగే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ