ఫోకస్

అనుమతులు తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలలో సెక్షన్ 84(3) ప్రకారం కృష్ణా గోదావరి నదులపై నూతన ప్రాజెక్టుల రూపకల్పన ప్రణాళిక, అమలు వంటివన్నీ ఆయా నదీ యాజమాన్య బోర్డు, సిడబ్ల్యుసి అనుమతి, ఆమోదం తర్వాత మాత్రమే జరగాల్సి ఉంటుంది. సెక్షన్ 85(8) ప్రకారం కృష్ణా గోదావరి నదులపై చేపట్టదలిచిన ఏ నూతన ప్రాజెక్టులనైనా అంతర్ రాష్ట్ర నదీ నీటివివాదల చట్టం ప్రకారం సంబంధిత అవార్డుల్లో కేటాయించిన నీటి ప్రకారం అప్పటికే చేపట్టిన ప్రాజెక్టులకు భంగం వాటిల్లకుండా ఉన్నపుడే ప్రతిపాదిత నూతన ప్రాజెక్టుల పరిశీలనకు పరిగణించాలి. అంతేగాక, 11వ షెడ్యూలులో పొందుపరిచిన నియమ నిబంధనలకు లోబడి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఇతరు విధులను నిర్వహించాల్సి ఉంటుంది. 11వ షెడ్యూలు ప్రకారం చూస్తే నదీ జల సంపదపై ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ నుండి అనుమతులు పొందకుండా కృష్ణా గోదావరి నదులపై ఆధారపడదగిన జలాలనే కారణంగా చూపి ఏ రకమైన నూతన ప్రాజెక్టులు ఇరు రాష్ట్రాలూ చేపట్టకూడదు, అపెక్స్ కమిటీ మంజూరు చేయడానికి ముందే అన్ని రకాల ప్రతిపాదనలు ముందుగా సంబంధిత బోర్డు సమీక్షించి, సాంకేతిక పరమైన అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సంబంధిత బోర్డులు క్లియర్ చేశాకనే అపెక్స్ కౌన్సిల్ మంజూరు ప్రక్రియ చేపడుతుంది. మే 2వ తేదీన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కూడా దీనిపై సుదీర్ఘంగా చర్చించి విషయాలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జలవనరుల మంత్రికి తెలియజేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా కృష్ణా-గోదావరి నదులపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులను చర్చించేందుకు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కూడా కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ చైర్మన్‌ను కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీని అపెక్స్ కౌన్సిల్ సమావేశం త్వరగా ఏర్పాటు చేయాలని కూడా కోరింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులు నిలుపు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర జలవనరుల శాఖను, అపెక్స్ కౌన్సిల్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్‌ను, కృష్ణా వాటర్ మేనేజిమెంట్ బోర్డును కోరుతూ తగిన చర్యలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన వివిధ పథకాలపై కూడా ఆంధ్రప్రదేశ్ అనేక చర్యలు చేపట్టింది.

- దేవినేని ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి