ఫోకస్

పార్టీలు మారకుండా చట్టం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పదవుల కోసం పార్టీలు మారుతున్నారు. రాజకీయాలపై పార్లమెంట్‌లో కఠిన నిర్ణయాలు, ఉన్నత న్యాయస్థానాల్లో చర్చకు తెచ్చే అవకాశాలు లేకపోయినా రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా ఒక బలపైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పార్టీ టికెట్‌పై గెలిచిన అభ్యర్థులు తన పదవీకాలం ముగిసిపోకుండానే మరో పార్టీలోకి మారుతున్నారు. అదేవిధంగా ఒక పార్టీలో ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న నాయకులను మరో పార్టీలో చేర్చుకోవడం వంటి చర్యలు రాజకీయాలపై విశ్వాసం కోల్పోవడమే అవుతుంది. రాజకీయ నాయకులు పదవీ కాంక్షలతో అధికార పక్షంలోకి దూకడం లేదా అమ్ముడుపోవడం, ఖర్చులు పెట్టడం, ప్రలోభపెట్టడం వంటివి ప్రస్తుత ఎన్నికల్లోనే చూస్తున్నాం. ఈ విధానాలతో ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు కోల్పోయే ప్రమాదముంది. ఇప్పటికే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు ఏ విధంగా అయతే విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విధంగా అభ్యర్థులు ఖర్చు పెడుతున్నారు. డబ్బు ఖర్చుపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టడం ప్రతి పార్టీలోనూ మామూలైపోయంది. ఒక ఎమ్మెల్యేకు ఇంత ఖర్చు పెట్టుకోవచ్చని ప్రభుత్వం నిర్దేశించినట్టుగానే, ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ఖర్చు పరిమితిని విధించాలి. ఎమ్మెల్యే ఖర్చు ఓటుకు వంద, రెండు వందలైతే.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఓటుకు వేలల్లోనే ఖర్చుపెడుతున్నారు. అదేవిధంగా క్యాంపులు నిర్వహణ బహిరంగంగానే కొనసాగుతుంది. పదవుల కోసం నిర్వహిస్తున్న క్యాంపులపై లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. ఇలాంటి చర్యలపై ఎన్నికల సంఘాలు కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలపై ఆంక్షలు విధించాలి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులపై నిఘా వేసినట్టు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖర్చుపైనా గట్టి నిఘా పెట్టాలి. ఇలా ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టి, పదవులు పొంది, మళ్లీ అవినీతి ద్వారానే ఆ సొమ్మును భర్తీ చేసుకుంటారు. ఏదీఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలు జరగాలి తప్ప.. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలతో సాగే రాజకీయాలు ఎక్కువ కాలం మనలేవు.

-కటారి శ్రీనివాస్ సామాజిక విశే్లషకుడు