ఫోకస్

జలవివాదాలకు ఏదీ పరిష్కారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలవివాదాలు దేశంలో కొత్త కాదు, అడపా దడపా వివిధ రాష్ట్రాల మధ్య జలవివాదాలు ముదిరి పాకాన పడటం, అదికాస్తా ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడం చాలాకాలంగా ఉన్నదే, ఇంతకాలం మహారాష్టత్రోనూ, మరోపక్క కర్నాటకతోనూ, ఇటు ఒడిశాతో కొనసాగిన జలవివాదాలు రాష్ట్ర పునర్విభజన తర్వాత పొరుగు రాష్ట్రంగా మారిన తెలంగాణతోనూ, చత్తీస్‌గఢ్‌తోనూ కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల జలవివాదాల రచ్చ ఢిల్లీకి కూడా చేరింది. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మంత్రులు ఢీ అంటే ఢీ అంటూ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో జలవైరం బట్టబయలు అయింది. 40 ఏళ్లుగా ఉన్న జల వివాదాలు ఇప్పటికీ సమసిపోలేదు, జలవివాదాల పరిష్కార బోర్డులు ఇచ్చిన తీర్పులు తు.చ. తప్పకుండా ఏ రాష్ట్రం అమలుచేయడం లేదనేది నిర్వివాదాంశం. సెంట్రల్ వాటర్ కమిషన్‌తోనూ, కృష్ణ రివర్ మేనేజిమెంట్ బోర్డుతోనూ జలవివాదాలపై చర్చలు జరుగుతున్నా స్పష్టమైన పరిష్కారం మాత్రం లభించలేదు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రైతులు ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్రం తీరుపై ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనికి స్పందించిన సుప్రీంకోర్టు తగిన సమాధానాన్ని కోర్టుకు సమర్పించాలని కేంద్ర జలవనరుల శాఖను, సెంట్రల్ వాటర్ కమిషన్‌ను, కృష్ణా రివర్ మేనేజిమెంట్ బోర్డును ఆదేశించింది. దీనికి ప్రతిగా సెంట్రల్ వాటర్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆయా ప్రాజెక్టుల డిపిఆర్‌లు సమర్పించలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇంతకుపూర్వం ఉన్న ప్రాజెక్టులు, పురోగతిలో ఉన్న ప్రాజెక్టులపైన కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టుల దుష్ప్రభావం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అధ్యయనం చేయాల్సిందిగా కూడా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రైతాంగం తిరిగి మే 4వ తేదీన తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను నిర్మించకుండా ఆదేశాలు జారీచేయాలంటూ మరో అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించింది. సుప్రీంకోర్టు దీనిపై మే 6న వాదనలు వింటూ ప్రతివాదులను నాలుగు వారాల్లో వారి సమాధానాలను సమర్పించాలని ఆదేశించింది. దానిపై ఇచ్చిన రిజాయిండర్ అఫిడవిట్లను కూడా అవి వచ్చిన రెండు వారాల్లో సమర్పించాలని కోరుతూ కేసును జూలై 20వ తేదీకి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎ.కె.గంగూలీ పర్యవేక్షణలో పిటిషన్ తయారుచేసి సుప్రీంకోర్టులో దాఖలు చేయడానికి సిద్ధం అవుతోంది. వాస్తవానికి ఈ వివాదాల పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఒక శాశ్వత విధానాన్ని కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎగువున ఉన్న తెలంగాణ కృష్ణానదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి పూర్తయతే దాదాపు 135 టిఎంసి నీటిని శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి తోడుకోవడానికి వీలు కలుగుతుంది. దీంతో ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా నది ఆయకట్టు దెబ్బతింటుంది. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాలు రాయలసీమకు అందుతాయి. కాని 800 అడుగులకే ఉన్న నీటిని తెలంగాణ తోడితే, శ్రీశైలం ప్రాజెక్టు ఇక ఎప్పటికీ నిండదు. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం అనుమతులు లేవనేది సుస్పష్టం. ఈ జలవివాదాలపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.

చిత్రం... తెలంగాణ రాష్ట్రం చేపట్టనున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాంతం