ఫోకస్

ప్రధాని ప్రతి అడుగు.. అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల పాలన అమోఘం.. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బాటలు వేసింది. అయితే అభివృద్ధి నిరోధకులైన విపక్షాలకు విమర్శించటానికి ఏమీ దొరక్క విదేశీ పర్యటనలను ప్రస్తావించడం దురదృష్టకరం. భారతదేశంలోనున్న అన్ని రకాల వనరులను పెంచుకుంటూ వాటిని సద్వినియోగపరచుకోవటం కోసమే విదేశీ పర్యటనలు సాగిస్తున్నారనేది గుర్తించకపోవటం బాధాకరం. పరిశ్రమల స్థాపనకోసమే గాక రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్ ఓడరేవులు, జాతీయ రహదారుల నిర్మాణాలకు సైతం విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అన్నింటికీ మించి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్నారు. నేడు అమెరికా తర్వాత ఇండియా పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగుతున్నది. ముందుగా పరిసరాల్లోని నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ దేశాలతో మిత్రత్వం బలపడింది. ముఖ్యమంత్రిగా మోదీ పాలనాదక్షునిగా పేరొందటం వలనే దేశ ప్రజలంతా ప్రధాని కావాలని కోరుకున్నారు. అందుకే ఎన్‌డిఎ ప్రభుత్వం గడచిన రెండేళ్లుగా ప్రజల మనోభావాలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రశంసలు పొందుతున్నది. ప్రధానంగా బిజెపి అధికారం చేపట్టిన నాటినుంచి పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నది. 123 కోట్ల భారత జనాభాలో 2012 నాటికి 60 కోట్ల మంది ప్రజలు అంధకారంలో వున్నారు. 18వేల గ్రామాలకు కరెంట్ వసతి లేదు. అధికారం చేపట్టిన బిజెపి కేవలం వెయ్యి రోజుల్లో ఆ మొత్తం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించి 2015లో 6,797 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించబడింది. ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాలు జరిగితే కేంద్రం సాయం ఏళ్ల తరబడి అందేది కాదు. తొలిసారిగా అతి తక్కువ సమయంలో లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నది. ముద్ర పథకం ద్వారా 2కోట్ల 70 లక్షల మంది చిరు వ్యాపారాలు చేసుకోటానికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.99,469కోట్ల విలువైన స్వయం ఉపాధి రుణాలు మంజూరయ్యాయి. స్వచ్ఛ్భారత్ ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మితమవుతున్నాయి. 2015-16 ఫిబ్రవరి నాటికి 5,164 కోట్ల డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి. ఈ రెండేళ్లలో ఇంతకంటే అధికంగా జరుగగలదని ఎవరైనా భావించగలరా.

- ఉప్పలపాటి శ్రీనివాసరాజు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ