ఫోకస్

కార్పొరేట్లకే వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్న కారణంతో ప్రజలు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపికి 2014 సాధారణ ఎన్నికల్లో పట్టం కట్టారు. గుజరాత్ రాష్ట్రానికి మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి, సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారన్న ప్రచారం జరగడంతో ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మారు. ప్రజలు తలచింది ఒకటైతే, వాస్తవంగా జరుగుతున్నది మరొకటి కావడం శోచనీయం. కాంగ్రెస్ పాలనలో అవినీతి రిటైల్‌గా కొనసాగితే, మోదీ పాలనలో హోల్‌సేల్‌గా కొనసాగుతోంది. ఉదాహరణకు అదాని గ్రూప్‌కు కందిపప్పు విదేశాల నుండి దిగుమతి చేసుకుని, భారత్‌లో విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ గ్రూప్ విదేశాల్లో కందిపప్పు రూ.30 కిలో చొప్పున కొనుగోలు చేసి, భారత్‌లో రూ.220కి కిలో చొప్పున విక్రయించింది. దీంతో అదాని గ్రూప్ 1,90,000 కోట్ల రూపాయలు సంపాదించింది. అంటే మోదీ ‘హిడెన్ అజండా’ను అమలు చేస్తున్నారు. పైకి పేదల సంక్షేమం అని జపిస్తూ, అంతర్గతంగా భారీ పెట్టుబడిదారులకు వంత పాడుతున్నారు. దేశంలో నిత్యావసర సరకుల ధరలు పెరిగినా, ఈ ధరలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం అధికంగా పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ తదితర దేశాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారత్‌లోని ధనికులు విదేశాల్లో దాచిన నల్లధనం భారత్ తీసుకువస్తామని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని మరచిపోయారు. విదేశాల్లోని నల్లధనం తీసుకువస్తే దేశంలోని ఒక్కో కుటుంబానికి 15 లక్షల రూపాయల వరకు లభిస్తాయని అప్పట్లో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికులకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటున్నారే తప్ప విదేశాల్లోని నల్లధనం రావడం లేదు. మంచి రోజులు వస్తున్నాయంటూ ఊదరగొట్టే విధంగా ప్రకటనలు చేస్తున్న బిజెపి ప్రభుత్వం, ఆ మంచిరోజులు కార్పొరేట్ సంస్థలకే అన్న విధంగా ప్రవర్తిస్తోంది. ‘ఘర్‌వాపసీ’ పేరుతో ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులను తిరిగి హిందూమతంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మోదీ సొంత భార్యనే ఇంటికి రానివ్వడం లేదు. అలాంటి వ్యక్తి దేశంలో మతమార్పిడి చేసుకున్న వారిని తిరిగి హిందూమతంలోకి తీసుకురావాలని ప్రయత్నించడం ఆశ్చర్యకరం. బిజెపి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ, కేసులు నమోదు చేస్తున్నారు. కన్హయ్య కేసే ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో కరవుతాండవిస్తుంటే విదేశాల్లో పర్యటిస్తూ, కాలం గడుపుతున్నారు. రోజూ 14 డ్రెస్‌లను మార్చుకునే ప్రధానిగా మోదీ పేరుతెచ్చుకున్నారు. ‘టీ’ బాయ్ కాస్త ‘షో’ బాయ్‌గా మారాడు. ఈ పరిస్థితి ఇలాగే సాగితే దేశ భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నడంలో సందేహం లేదు.

కె. నారాయణ, సిపిఐ జాతీయ కార్యదర్శి