ఫోకస్

ఏపికి మోదీ న్యాయం చేస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన అనంతరం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నవ్యాంధ్రను అన్ని విధాలా ఆదుకునేది కేంద్రంలోని ఎన్‌డియే ప్రభుత్వమే. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల విషయంలో కేంద్రం ఒక స్పష్టమైన వైఖరితో ఉంది. అన్ని రాష్ట్రాలతోపాటు సమాన న్యాయం చేస్తూనే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక కోణంలో చూస్తూ కేంద్రం సహకారం అందిస్తోంది. విభజన చట్టంలో లేని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటూ కేంద్రం ఏపీకి చేయూతనిస్తోంది. విభజన చట్టంలో పేర్కొన్న వాటితోపాటు అదనంగా మరిన్ని విద్యా సంస్థలను ఆంధ్రకు కేటాయించింది. కేంద్రం హామీ ఇచ్చిన విధంగా నవ్యాంధ్రలో 17 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే 11 విద్యా సంస్థలను కేటాయించగా, 9 విద్యా సంస్థలు మంజూరయ్యాయి. వీటిలో కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు కూడా జరుగుతున్నాయి.
విభజన చట్టంలో లేని నైపర్ యూనివర్శిటీ, పెట్రోలియం యూనివర్శిటీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ప్యాకేజీ యూనివర్శిటీలను కేంద్రం మంజూరు చేసింది. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటులో ఉన్న అడ్డంకులను తొలగించేది, జోన్ ఇచ్చేది కూడా కేంద్రమే. నవ్యాంధ్రకు మరోపెద్ద వరం ‘పోలవరం’. కేంద్రంలో మోదీ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత తొలి కేబినెట్ సమావేశంలోనే పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి తొలగించి, నవ్యాంధ్రలో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకున్నదీ కేంద్రమే. పోలవలం ప్రాజెక్టును నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసే బాధ్యత కూడా కేంద్రలోని మోదీ సర్కారే తీసుకుంటుంది. గత సాధారణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేసిన భారతీయ జనతా పార్టీ ఇక ముందు కూడా మిత్ర ధర్మాన్ని పాటిస్తూనే ముందుకు వెళ్తుంది. ఇదే సందర్భంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావాల్సి అంశాన్ని పరిగణలోకి తీసుకుంది. రెండెళ్ల కింద కేవలం 2లక్షల మంది సభ్యత్వం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు బిజెపి 25 మంది సభ్యులతో మిగతా పార్టీలతో సమానంగా సంస్థాగత కేడర్‌ను బలోపేతం చేసుకుంది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి, తెలుగుదేశంతో ఎన్నికల అవగాహనకు సంబంధం లేదు. తెలుగుదేశం, బిజెపి రెండు పార్టీలు సమన్వయం చేసుకుంటూనే భవిష్యత్‌లో సైతం ముందుకు సాగుతాం. రాష్ట్రం నుంచి రాజ్యసభకు బిజెపి అభ్యర్థికి స్థానం కల్పించడం కూడా మిత్ర ధర్మంలో భాగమే. రెండేళ్ల మోదీ పాలనలో అటు కేంద్ర, ఇటు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు.

కంభంపాటి హరిబాబు, విశాఖ ఎంపి, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు