ఫోకస్

ఇదేనా పరిపాలన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రజల్లో నేటికీ సెంటిమెంట్ బలంగా ఉంది. దాంతో టిఆర్‌ఎస్ గత రెండేళ్లలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తోంది. అంతేకాని ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలన అద్భుతంగా ఉందన్న భ్రమలు ప్రజల్లో లేవు. కెసిఆర్ ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విపక్షాలను పరిగణనలోకి తీసుకోకపోవడం, ఉద్యమాలను అణచివేయడం బాహాటంగా కనిపిస్తున్న అంశాలు. ప్రజలకు కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాల్లో దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, ఐదు లక్షల ఇళ్లను బలహీన వర్గాలకోసం నిర్మించాల్సి ఉంది. పేదలకు అవసరమైన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం. నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైన్ చేసి 84వేల కోట్ల రూపాయలు అధికంగా ప్రజలపై భారం వేయడం, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన పనులకు ఎక్కువ ఖర్చు, ఎక్కువ సమయం వెచ్చించడం ప్రజలు గమనిస్తున్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో నాలుగు నుండి ఐదు లక్షల ఎకరాల పేదల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని పారిశ్రామికవేత్తలకు, ప్రాజెక్టులకోసం కేటాయిస్తుండటంతో రైతుల్లో అసంతృప్తి రేగుతోంది. హరితహారం పేరుతో గిరిజనుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది. మైనారిటీలకు విద్య, ఉద్యోగాలలో 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఆశలు కల్పించి, అమలు చేయలేకపోయారు. బిసిల సంక్షేమానికి ఎస్‌సి, ఎస్‌టిల తరహాలో ఉప-ప్రణాళిక అమలు చేస్తామని చేయలేకపోయారు. వృత్తిపనివారికి ఉపాధి కల్పించలేకపోతున్నారు. కెజి టు పిజి వరకు ఉచితంగా విద్య అందించే పథకం మరిచిపోయారు. అయతే విద్యుత్‌కోత లేకుండా ఇవ్వడం, నక్సలైట్ల సమస్య లేకుండా చేయడం, పెట్టుబడులు భారీగా వచ్చేలా చూడటంలో కెసిఆర్ విజయం సాధించారు. అయినప్పటికీ వౌలికమైన అంశాల్లో కెసిఆర్ విఫలం చెందారు. కెసిఆర్ పాలన ప్రజల ఆశయాలకు అనుకూలంగా లేదని వాస్తవ పరిస్థితి వెల్లడిస్తోంది.

- చెరుపల్లి సీతారాములు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు.