ఫోకస్

ఇద్దరు సిఎంలూ విఫలమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రెండేళ్లయింది. పార్లమెంటు సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు కల్లలయ్యాయి. ఆరువందలకుపైగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లోనూ విఫలమయ్యారు. తెలంగాణలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మాటలకే పరిమితమైంది. ధనిక రాష్టమ్రంటూ ప్రకటనలేకాని వాస్తవంలో అభివృద్ధి మందగించింది. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు రాజధాని తరలింపుపై స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణాలు చేపట్టి ఉండే బాగుండేది. కాని ఏడాదిన్నర సమయం వృథా చేశారు. ఈ రోజు భవన నిర్మాణాలు పూర్తికాకుండానే ఉద్యోగులు వచ్చేయమని హుకుం జారీ చేస్తున్నారు. దార్శనికత లేమికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. పదేళ్లపాటు ఆంధ్రాకు హక్కులుంటాయి. ఆ హక్కుల వినియోగంలో కూడా చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని తన ప్రయోజనాలు కాపాడుకునేందుకు రాష్ట్ర అభివృద్ధిని తాకట్టుపెట్టారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. వడ్డీలను కూడా రద్దు చేయలేకపోయారు. ఇసుక మాఫియా విజృంభించింది. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీ తుస్సుమంది. నిరుద్యోగ భృతిని ఇవ్వడం లేదు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గుడ్లప్పగించి చూస్తున్నారు. కెసిఆర్‌ను విమర్శించేందుకు చంద్రబాబు జంకుతున్నారు. రైల్వే జోన్ లేదు. పట్టిసీమ ప్రాజెక్టును నిర్మించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగేటట్లు చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు జలాలపై రాయలసీమకు హక్కులున్నాయి. దీనిని పట్టించుకోవడం లేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా ఉన్నా విభజన చట్టంలో హామీల అమలులో వైఫల్యమే. ప్రత్యేక హోదాను అటకెక్కించారు. తెలంగాణలో కూడా కెసిఆర్ ప్రభుత్వం పరస్పర విరుద్ధమైన నిర్ణయాలతో ఉన్నారు. సచివాలయాన్ని ముందుగా ఎర్రగడ్డ ఆసుపత్రి స్ధలానికి మారుస్తామన్నారు. ఆ తర్వాత మిలిటరీ గ్రౌండ్స్‌కు మారుస్తామన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి మళ్లీ ఉన్న సచివాలయాన్ని పడగొట్టి కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు, కెసిఆర్ సరిగా అమలు చేయకపోవడంతో ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్‌ను సద్వినియోగం చేసుకోకుండా వ్యక్తిగత ప్రచారం, ఆర్భాటాలకు అలవాటుపడ్డాయి. ఇరు రాష్ట్రాల సిఎంల మధ్య సయోధ్య లేదు. ఇద్దరు సిఎంలు ప్రతిపక్ష పార్టీలను తుడిచిపెట్టేకార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారు. ప్రజల్లో రెండు తెలుగు ప్రభుత్వాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది.

- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత