ఫోకస్

ఏమున్నది గర్వకారణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమైక్యాంధ్రలో అనాదిగా తెలంగాణ అన్యాయానికి, వివక్షకు గురవుతున్నదన్న భావనతో ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. దీంతో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పటి యుపిఎ ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయంచింది. కానీ రెండేళ్ళ టిఆర్‌ఎస్ పాలన అంతా ఆగమ్యగోచరంగా ఉంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియంతృత్వ పోకడతో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరగడం లేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాజకీయంగా బలపడేందుకు దృష్టి సారిస్తున్నారే తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించడం లేదు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజ్యాంగాన్ని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో పటిష్టమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే పాలనకు ‘చెక్’ ఉంటుంది. కానీ ప్రతిపక్షాలను బలహీనపరచాలని, ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన. ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్టమ్రైన తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వంపై నెపం వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడిపేయడం బాధాకరం. రుణమాఫీ ఏకకాలంలో సాధ్యం కాదన్న విషయం అందరూ అర్థం చేసుకోగలరు. కానీ దశలవారీగా ఇస్తామన్న 20 శాతమైనా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు విడుదల చేయకపోతే రైతులు ఎలా నిలదొక్కుకుంటారు. ఖరీఫ్ ఆరంభమైనా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించలేదు, రుణ మాఫీపై స్పష్టత లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎకరా పంటకూ ఇన్సూరెన్స్ ప్రకటించి ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంది. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునేవారికి నష్టపరిహారం ఉండదు. క్రాప్ ఇన్సూరెన్స్‌కు ప్రీమియం కట్ చేస్తారు. కేంద్రం నుంచి లభించే ఇన్‌పుట్ సబ్సిడీకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయలేదు. కరవు మండలాల గుర్తింపు శాస్ర్తియబద్ధంగా చేయలేదు. ఉదాహరణకు కరీంనగర్‌లో 19 మండలాలను గుర్తించి, 21 మండలాలను పక్కన పెట్టారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం లేదు, ఉన్న పరిశ్రమలు ఖాయిలా పడుతున్నాయి. కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అని చెప్పినా ఇంతవరకు ఎక్కడా అమలు కావడం లేదు. విద్యా హక్కు చట్టం లేదు, వర్సిటీలకు విసిలు లేరు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు లేవు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలు చేపట్టినా, గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన బంగారు తల్లి పథకాన్ని రద్దు చేయడం బాధాకరం. జాతీయ నాయకునిగా చెప్పుకునే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం పరిష్కారానికి కృషి చేయాలి. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో విమర్శిస్తున్న చంద్రబాబు ఆంధ్రలో ప్రోత్సహించడం బాధాకరం.

- టి. జీవన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే