ఫోకస్

దేశంలోనే ఓ చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా పాలన సాగిస్తోంది. తెలంగాణ ఏర్పడితే అంతా చీకటే అంటూ పలికిన రాజకీయ నాయకుల జీవితాలు చీకటిమయం అయ్యాయి కానీ తెలంగాణ మాత్రం వెలుగుల్లో ఉంది. ఎండాకాలం వచ్చిందంటే విద్యుత్ కోతతో అల్లకల్లోలంగా మారేది. పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చేవాళ్లు. అలాంటిది టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోంది. 38వేల కోట్ల రూపాయల వరకు సంక్షేమ రంగానికి వ్యయం చేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు మొత్తం దేశం దృష్టిని ఆకర్శిస్తున్నాయి. దేశం మొత్తంలో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టాలని నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. ప్రధానమంత్రి సైతం ఈ పథకాలను మెచ్చుకున్నారు. హాస్టళ్లలో సైతం గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. గత రెండేళ్ల నుంచి వరుసగా కరువు సమస్యవల్ల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్రంలోనీ భారీనీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారించవచ్చు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ను దీనికోసమే చేస్తున్నారు. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశారు. ఈసారి వర్షాలు బాగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షాలు కురిస్తే మిషన్ కాకతీయ ఫలాలు అందుతాయి. కరవు ఒక్కటే తెలంగాణకు సమస్య. ఈసారి వర్షాలు కురిస్తే చెరువుల వల్ల సమస్య తీరుతుంది. మూడేళ్లలో ప్రాజెక్టులు చివరి దశకు చేరుకుంటాయి. పలు ప్రాజెక్టులు పూర్తవుతాయి. కరవు అనే మాట లేకుండా పోతుంది.
దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల తరువాత కూడా సురక్షితమైన మంచినీళ్లు లేకపోవడం బాధాకరం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించే పథకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇంటింటికి మంచినీటిని ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన పలుసర్వేల్లో దేశ వ్యాప్తంగా ప్రజాధరణ గల ముఖ్యమంత్రిగా కెసిఆర్ మొదటిస్థానంలో నిలిచారు. సమైక్య రాష్ట్రంలోని సమస్యలు ఇంకా సమసి పోలేదు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటూ కుట్రలు పన్నుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా బంగారు తెలంగాణ సాధన లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పినవన్నీ చేసి చూపిస్తారు.

- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ