ఫోకస్

అబద్ధాలు చెప్తున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనా రంగంలో పూర్తిగా విఫలమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోయింది. అవినీతి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకే నవనిర్మాణ దీక్ష పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలకులు ప్రజలకు నమ్మకం, ధైర్యం, స్థైర్యం కల్పించవలసింది పోయి రాష్ట్ర విభజన, చీలిక, కష్టనష్టాలు, అన్యాయం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం, ఆందోళన సృష్టిస్తున్నారు. విభజనతో ఏర్పడే మంచిచెడు ప్రజలకు తెలిసిందే. పరిపాలనాదక్షుడిగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రికి అధికారంలోకి వచ్చాక ఎదుర్కోవలసిన సమస్యలు తెలియవా? రెండేళ్ల కాలంలో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమిటి? ఒకపక్క ముఖ్యమంత్రి, మంత్రులు లేనిపోని ఆర్భాటాలు, విలాసాలకు పోతూనే విభజన కష్టాలు, ఆర్థికలోటు, ఖజానా ఖాళీ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ రాష్ట్ర సమస్యలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళికబద్ధంగా కేంద్రంనుంచి నిధులు రాబట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం క్షణాల్లో అంతా జరిగిపోవాలనే ధోరణితో వ్యవహరిస్తోంది. కేంద్రానికి నిధులు, అభివృద్ధి పథకాల మంజూరులో నిర్దిష్ట నియమ నిబంధనలు ఉంటాయ, కానీ వీటికి భిన్నంగా రాష్ట్రం వ్యవహరిస్తోంది. పోలవరం విషయానికి వస్తే ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తామే నిర్మిస్తామని కేంద్రం చెబుతుంటే, లేదు తామే కడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం వెనక కాంట్రాక్టులు, కమీషన్ల ప్రభావం ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవాలి. తమ ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉంటుందంటూ చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. కానీ పట్టిసీమ, ఇసుక రవాణాలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు? రాజధాని నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని ఖరీదైన భూములు మంత్రులు, వారి తాబేదారులు కొనుగోలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. చివరకు పాలు, పెరుగు, నెయ్యి తదితర సరుకులు సొంత సంస్థ హెరిటేజ్ నుంచే కొనాలనే బెదిరింపులు కొనసాగుతున్నాయి. నదీజలాల విషయంలో ఏర్పడిన వివాదాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ కృష్ణా, గోదావరిలపై అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకోవాలని అందరూ కోరుతుంటే ముఖ్యమంత్రి నోరు మెదపకపోవటం అనుమానాలు కలిగిస్తున్నాయి. పైపెచ్చు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది వైకాపా మద్దతుదారులని బురద చల్లుతున్నారు.

- బొత్స సత్యనారాయణ, వైకాపా సీనియర్ నేత