ఫోకస్

రెండు రాష్ట్రాలు.. రెండేళ్ల పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి రెండేళ్లు, కొత్త రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం, మరోపక్క అవశేష ఆంధ్రప్రదేశ్ విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్నాయి. కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా రెండేళ్లు పూర్తి చేసుకుంది. రెండు రాష్ట్రాల్లో కరవు, రైతాంగ సమస్యలు, మహిళా సమస్యలు, విద్యారంగ సమస్యలు, రిక్రూట్‌మెంట్‌లు ప్రభుత్వాలను ఉక్కిరిబిక్కిరి చేయగా, ఇటు తెలంగాణకు విద్యుత్ సమస్య, సాగునీరు-తాగునీటి సమస్యలు పట్టి పీడించాయి. ఆంధ్రాకు వరదలు తుపాన్లు, హుదుద్, గోదావరి పుష్కరాల తొక్కిసలాట తదితర సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. మరోపక్క కేంద్రం వద్ద ఇరు రాష్ట్రాల సమస్యల పంచాయితీలకు లెక్కే లేదు. షెడ్యూలు 10లోని సంస్థల విభజన, ఆస్తులు అప్పుల పంపకం, ఉద్యోగుల పంపిణీ, జలవనరుల కేటాయింపు, ప్రాజెక్టులు అనుమతులు వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇన్ని సమస్యలు మధ్య రెండు రాష్ట్రాలూ చెప్పుకోదగిన ప్రగతిని సాధించాయి. దేశంలోనే ఉత్తమ సిఎంగా కెసిఆర్‌ను కొన్ని సంస్థలు కొనియాడగా, వ్యాపారం చేసుకునేందుకు ఉత్తమ రాష్ట్రంగా ఎపిని ప్రపంచబ్యాంకు గుర్తించింది. ఇలా తమదైన శైలిలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనుభవాన్ని, నైపుణ్యాన్ని, మేథస్సును వినియోగించి రాష్ట్భ్రావృద్ధికి ఎన్నో చర్యలు చేపడుతున్నారు. నిధులు ఎక్కువగా ఉన్నా తెలంగాణ రాష్ట్రం సమస్యలు భిన్నమైవని, ఆంధ్రాలో ఆదాయానికి మించిన తలనొప్పులు అనేకం. ఇంత జరిగినా, నా అంచనాలను మీరు కాదు, నేనే అందుకోలేను అంటూ ఆంధ్రా సిఎం చంద్రబాబు వినూత్నంగా ఆలోచిస్తూ, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. 2050 వరకూ ఎలాగైనా అధికారంలో ఉండాలనే స్కెచ్ వెసుకున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా ప్రభుత్వ పనితీరును, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వ పరంగా చేయలేకపోయిన పనులను పార్టీ పరంగా చేయడం ద్వారా తమిళనాడు తరహాలో పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని తపన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అన్ని ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఆంధ్రాలో వైకాపా నుండి, తెలంగాణలో టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుండి ఫిరాయింపులను అధికార పార్టీలు ప్రోత్సహించడం ద్వారా రాజకీయ పోరుకు తెరతీశాయి. తెలంగాణలో పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు విద్యుత్‌లో మిగులుకు ప్రయత్నించిన ప్రభుత్వం స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుంది. నూతన పారిశ్రామిక విధానంతో ప్రపంచంలోనే బహుళ జాతి కంపెనీలన్నీ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర తలుపులు తడుతున్నాయి. ఆపిల్, గూగుల్, మెక్రోసాఫ్ట్, ఆమెజాన్ వంటి ప్రపంచ ఐటీ రంగాన్ని శాసిస్తున్న నాలుగు కంపెనీలు తమ వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌ను అత్యంత అనుకూలమైందిగా ఎంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సైతం పరిశ్రమల అనుమతి విధానంలో తీసుకొచ్చిన నూతన పద్ధతులు ప్రపంచంలోని అన్ని దేశాలను ఆకర్షించాయి. అమరావతిని అత్యుత్తమ ఆధునిక నగరంగా తీర్చిదిద్దే క్రమంలో బ్యాంకులు, పరిశ్రమలు, ఐటి పరిశ్రమలు, విద్యాసంస్థలు, యూనివర్శిటీలు క్యూకడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఐఐటి, సెంట్రల్ యూనివర్శిటీ, ఎన్‌ఐటి, ఉద్యానవన యూనివర్శిటీ, వ్యవసాయ యూనివర్శిటీ, లా యూనివర్శిటీ, సైన్స్ యూనివర్శిటీ, ఐఐఎం, గిరిజన వర్శిటీలు వచ్చాయి. ఐటి కారిడార్లు, ఐటి సెజ్‌లు, పెట్రోలియం కారిడార్, కోస్టల్ కారిడార్, హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో రాష్ట్రానికి కొత్త సొబగులు వచ్చాయి. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల పురోగతిపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.