ఫోకస్

ప్రజా కోర్టులో భంగపాటు తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ఎన్నికల్లోనైనా అధికార పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీలను తుడిచిపెట్టుకునిపోయే విధంగా వ్యవహరించడం అమానుషం. ఈ తరహా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ఇష్టమైన పార్టీకి ఓటు వేసే హక్కు ఉంటుంది. అలాగే తమకు నచ్చిన పార్టీలో నాయకులు చేరవచ్చు. కాని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న తంతు చూస్తుంటే, అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ఒక పథకం ప్రకారం విపక్షాలు లేకుండా చేసేందుకు కుట్రపన్నుతోందనే అనుమానం వస్తోంది. బలం లేనిచోట కూడా ఏకగ్రీవంగా తమ పార్టీ అభ్యర్థులు శాసనమండలికి ఎంపిక చేసుకున్న తీరు చూస్తుంటే జుగుప్సాకరంగా ఉంది. తెలంగాణలో గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు ఈ తరహా రాజకీయ సంఘటనలు జరగలేదు. దివంగత ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదు. రాజకీయాల్లో చతురత, ఎత్తుకు పై ఎత్తు సాధారణమే. ఇవి లేకపోతే రాజకీయాలు ఉండవు. కాని విపక్ష పార్టీ నేతలను ప్రలోభాలకు గురిచేసి, వారిని మానసికంగా వేధించి అధికార పార్టీలోకి చేర్చుకోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ఉద్యమ పార్టీ. 14 సంవత్సరాల పాటు కెసిఆర్ పార్టీని ఉద్యమ పార్టీగా నడిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం లేదు. అందుకే ఆ పార్టీకి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టిని పెట్టారు. సాధారణ సమయంలో పార్టీని పటిష్టం చేయకుండా, ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతలకు వల వేసి సామూహికంగా అందరినీ చేర్చుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. 2019 ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు. తెలంగాణ ప్రజలు చైతన్యపరులు. ఉద్యమాల ఖిల్లా తెలంగాణ. కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైకాపా, వామపక్ష పార్టీల్లోని కీలక నేతలు, రెండవ శ్రేణి నేతలను వరుసపెట్టి చేర్చుకోవడం అంటే టిఆర్‌ఎస్ బలపడినట్లు కాదు. ఇలా చేరిన వాళ్లందరూ టిఆర్‌ఎస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై కాదు. అధికారం చూసి, ఎందుకొచ్చిన గొడవని చేరేవాళ్లు చాలామంది ఉన్నారు. ప్రజలు అధికార టిఆర్‌ఎస్ పార్టీ చదరంగ క్రీడను ఒక కంట కనిపెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ధోరణి వల్ల సాధారణ ఎన్నికల్లో భంగపాటు తప్పదు.

- కొండా రాఘవరెడ్డి తెలంగాణ వైకాపా అధికార ప్రతినిధి