ఫోకస్

వాస్తవాలే వెల్లడించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో సమర్థవంతమైన పరిపాలనను అందివ్వడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. చంద్రశేఖరరావు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేశారు. తెలంగాణ వస్తే, ప్రభుత్వ స్వరూపమే మారిపోతుందని, క్షణాల్లో అన్ని పనులూ జరిగిపోతాయని ప్రజలంతా ఎంతో ఆశపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, కెజి నుండి పిజి వరకు ఉచిత విద్య, ఉద్యోగ ఖాళీల భర్తీ, సాగునీటి సరఫరా తదితర అనేక హామీలు ఇచ్చారు. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరాకైనా సాగునీటిని అదనంగా అందించారా? దళితులకు భూమి ఇస్తున్నారా? కెజి టు పిజి విద్య సంగతేమిటి? మిషన్ భగీరథ, రెండుగదుల ఇళ్ల నిర్మాణం తదితర పనులకు నిధులు ఇవ్వకుండా అప్పులు తీసుకువస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. కెసిఆర్ పరిపాలన ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. రెండేళ్లపాటు కోదండరాం ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు. స్వేచ్ఛగా పాలన కొనసాగించేందుకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం పాలన గాడి తప్పుతుండటంతో ముందుకు వచ్చారు. పరిపాలనా లోపాలను ఎత్తిచూపారు. సరిచేసుకొమ్మని సూచించారు. అందులో తప్పేముంది? ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విపక్షాల అభిప్రాయాలు తీసుకునేందుకు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. విపక్షాలకు విలువే ఇవ్వడం లేదు. తెలంగాణలో ప్రతిపక్షం ఉండకూడదన్నదే కెసిఆర్ భావిస్తున్నట్టు అనిపిస్తోంది. నియంతలే ఈ విధమైన ఆలోచనలను కలిగి ఉంటారు. ప్రజాస్వామ్యంలో విపక్షాలు ఉండాలి. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపాలి. ఆ తప్పులను సరిదిద్దుకుంటే సుపరిపాలన అందించేందుకు వీలవుతుంది. లేకపోతే అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన సమయంలో ఇంటికి పంపిస్తారు. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉండటంతోపాటు, బలమైన విపక్షం లేకపోవడంవల్ల ఉపఎన్నికల్లో ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. బలుపును చూసి కెసిఆర్ లావు అనుకుంటే ఇబ్బందికి గురికాక తప్పదు. ఇతర పార్టీల నేతలు టిఆర్‌ఎస్‌లో ఎందుకు చేరుతున్నారని ప్రశ్నించుకుంటే, అధికార పార్టీలో ఉంటూ డబ్బు సంపాదించుకోవచ్చన్న యావతోనే అని చెప్పుకోకతప్పదు. విపక్షాలు విమర్శిస్తే, రాజకీయాలు అంటూ ప్రచారం చేస్తారు. అందుకే రాష్ట్ర పార్టీలతో కూడిన సంయుక్త జెఎసి చైర్మన్ హోదాలో కోదండరామ్ విమర్శిస్తే మంత్రులంతా ధ్వజమెత్తారు. ఇది సరైన విధానం కాదు. ఇక మీదట టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాం. మూడు, నాలుగు నెలల్లో ఇది ఒక రూపం సంతరించుకుంటుందని భావిస్తున్నారు.

- చాడా వెంకట్‌రెడ్డి కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర శాఖ, తెలంగాణ