ఫోకస్

సరైన దారిలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవై ఏళ్ల సమైక్య పాలనపై పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం రెండేళ్ల పాలనలోనే దేశంలో అనేక రంగాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతోంది. ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేయడం ద్వారా కోటి ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. సంక్షేమ పథకాలకు ఏటా 38వేల కోట్లను వ్యయం చేస్తున్న రాష్ట్రం దేశంలో మరోటి లేదు. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూనే మరోవైపు నీటిపారుదల ప్రాజెక్టులకు, వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. గడిచిన రెండేళ్ల నుంచి వర్షాలు లేవు. కరవు వల్ల రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతుల ఆత్మహత్యలపై కోర్టుకు వెళితే ప్రచారం కోసం కాదు. ప్రభుత్వం ఏం చేయాలో స్పష్టంగా చెప్పమని కోర్టు అడిగింది. తెలంగాణ ఏర్పాటుకోసం తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరు ఉద్యమించారు. లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా అందరూ తెలంగాణ ఏర్పాటును కోరుకున్నారు. 2009 డిసెంబర్ వరకు ఏ పార్టీకి ఆ పార్టీ తెలంగాణకోసం ఉద్యమించాయి. అయితే ఉద్యమంలో కీలక భూమిక టిఆర్‌ఎస్‌దే. కెసిఆర్ దీక్షతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించక తప్పలేదు. 2009 డిసెంబర్‌లో తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించి సీమాంధ్ర నాయకుల రాజీనామాతో వెనక్కి వెళ్లింది. ఈ సమయంలో తెలంగాణ ఉద్యమ నాయకునిగా కెసిఆర్ కాంగ్రెస్ నాయకులు జానారెడ్డిని కలిసి తెలంగాణ జెఎసి ఏర్పాటుకు పూనుకున్నారు. అలా ఏర్పడింది టిజెఎసి. రెండేళ్ల తెలంగాణ పాలనపై ప్రోఫెసర్ కోదండరామ్ మాటలు ఆవేదన కలిగించాయి. అరవై ఏళ్ల సమస్యలను రెండేళ్లలో మొత్తం పరిష్కరించాలని కోరుకుంటున్నారు. రెండేళ్ల పాలనలో తప్పులు ఏమైనా జరిగితే స్పష్టంగా వాటి గురించి ఎవరైనా చెప్పవచ్చు. వ్యవసాయ రంగం సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికే మిషన్ కాకతీయ, కోటి ఎకరాలకు సాగునీరు వంటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడిక తీసివేత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి సైతం అభినందించారు. ఈ విధానాన్ని అమలు చేయాలని నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసింది. 60 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలో అనేక గ్రామాలకు మంచినీరు లేని పరిస్థితి. తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీళ్లు, ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రజల ప్రాధాన్యత అంశాలు ఏమిటో గ్రహించి ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయాలు చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం తగదు. ఏ రంగంలో ప్రభుత్వం పని చేయలేదో స్పష్టంగా చెబితే అర్థం ఉంటుంది. విమర్శకోసం విమర్శ అంటే ప్రజలు హర్షించరు.

- ఎర్రోళ్ల శ్రీనివాస్ టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు