ఫోకస్

న్యాయ దేవతను రోడ్డెక్కించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల తీరు వల్ల న్యాయ వ్యవస్ధ కూడా రోడ్డెక్కింది. హైదరాబాద్‌ను వదిలిపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి కదులుతోంది. హైకోర్టును కూడా వీలైనంత త్వరలో ఎటూ ఏర్పాటు చేసుకుంటారు. కేంద్రం కూడా రెండురాష్ట్రాల మధ్య నలుగుతున్న హైకోర్టు అంశాన్ని పరిష్కరించడంలో విఫలమైంది. ఈ మొత్తం గందరగోళానికి కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. హైకోర్టును వీలైనంత త్వరగా ఏపికి తరలించాలనే చిత్తశుద్ధి ఆంధ్ర ప్రభుత్వానికి కరవైంది. విభజన జరిగి రెండేళ్లయింది. ఇంతవరకు హైకోర్టును తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదు. ఈలోగా న్యాయాధికారుల కేటాయింపును వ్యతిరేకిస్తూ తెలంగాణ న్యాయవాదులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేసినందుకు కొంత మంది న్యాయాధికారులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇది నిజంగా బాధాకరమైన అంశం. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు న్యాయవాదులు,న్యాయాధికారులు, న్యాయ వ్యవస్ధను ఆడుకుంటున్నాయి. భేషిజాలు మాని ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకుని హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధులను ఏపికి కేటాయించాలి. దీనికి రోడ్ మ్యాప్‌ను ప్రకటించాలి. తెలంగాణ, ఆంధ్ర న్యాయవాదులు కూడా ప్రశాంతంగా ఉండి తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వాలపై వత్తిడి తేవాలి. ఆందోళనల వల్ల పవిత్రమైన న్యాయవృత్తి ఇమేజి దెబ్బతింటుంది. హైకోర్టును విభజించి ఇక్కడే ఆంధ్ర హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చట్టం ఒప్పుకుంటుందా ? ఉమ్మడి రాజధాని పదేళ్లు పాటు అమలులో ఉంటుంది. కాభట్టి అమరావతిలో తగిన వౌలిక సదుపాయాలు లేకపోతే, ఏపికి అవసరమైన హైకోర్టు భవనాలను ఇక్కడ ఏర్పాటు చేయవచ్చు. రెండు ప్రభుత్వాలు విబేధాలను పక్కనపెట్టి చర్చించుకుని సాఫీగా హైకోర్టు విభజన ప్రక్రియకు చర్యలు తీసుకోవాలి. అలాగే హైకోర్టు కూడా పెద్ద మనుసుతో న్యాయాధికారులపై వేసిన వేటును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.

- శివకుమార్ ప్రధాన కార్యదర్శి, వైకాపా తెలంగాణ శాఖ