ఫోకస్

ఆప్షన్లు ఉండవన్న వాగ్దానం ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ అధికారం చేపడితే ఉద్యోగులకు, న్యాయాధికారులకు ఆప్షనే్ల ఉండవని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికలకు ముందు వాగ్దానం చేశారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత ఆ మాటే మరిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్పన్లు కల్పించారు. ఇప్పుడు తాజాగా న్యాయాధికారుల విషయంలో వివాదం నెలకొంది. కాంగ్రెస్ లేదా మరో పార్టీ అధికారం చేపడితే ఆప్షన్లు ఇస్తారు జాగ్రత్త అని కెసిఆర్ ఎన్నికలకు ముందు చెప్పి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్నారు. ఇది ఒక రకంగా ప్రజలను దగా చేయడమే అవుతుంది. రాష్ట్ర హైకోర్టు విభజన, న్యాయాధికారులకు ఆప్షన్లు కల్పించడంతో వారు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. జడ్జీలు ఎప్పుడూ రోడ్లపైకి వచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో న్యాయవాదులు నల్లకోట్లు ధరించి రోడ్లపైకి వచ్చి పోలీసుల లాఠీదెబ్బలకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశించారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతున్నది. అందుకే మళ్లీ వారు రోడ్డెక్కారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కేంద్రంతో ఎందుకు పోరాడలేకపోతోంది? అంటే కేవలం ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడానికే. ఒకటి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం, రెండోది మోదీ మంత్రివర్గంలో చేరాలన్న తపన. వీటి కారణంగానే మోదీ ప్రభుత్వంతో పోరాడడం లేదు. ఆ పనిని న్యాయవాదులు, న్యాయమూర్తులు చేయాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు పార్లమెంటును వారం రోజులపాటు నడవకుండా చేస్తే కేంద్రం ఎందుకు దిగిరాదు. తప్పకుండా దిగి వచ్చి సమస్యను పరిష్కరిస్తుంది. తాను చేయబోయే యాగానికి హాజరుకావాలని విజయవాడకు వెళ్ళి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఇప్పుడు ఈ సమస్య పరిష్కారంకోసం హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్ళి చంద్రబాబును ఎందుకు కలవడం లేదు. ఏదో నామమాత్రంగా జంతర్-మంతర్ వద్ద ధర్నా చేస్తానని కెసిఆర్ ప్రకటించారు. నిజానికి కెసిఆర్ ధర్నా చేయాల్సింది జంతర్-మంతర్ వద్ద కాదు ప్రధాని మోదీ నివాసం వద్ద చేయాలి.
పైగా రాష్ట్ర హైకోర్టు విభజన అంశం తమ పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్రకటించడం బాధ్యత నుంచి తప్పుకోవాలని యత్నించడమే అవుతుంది. ఉభయ రాష్ట్రాలు ఒక సమస్యను పరిష్కరించుకోలేకపోతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత లేదా? రాష్ట్ర హైకోర్టు విభజన, ఆప్షన్లపై కాంగ్రెస్ స్పష్టతతో ఉంది.

- డాక్టర్ శ్రవణ్ దాసోజు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి