ఫోకస్

ప్రమాణాలు దిగజారాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానం పూర్తిగా దిగజారిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద, మద్య తరగతి విద్యార్థులకు గొప్ప వరం అని ప్రచారం కెజి టు పిజి జాడ లేకుండా పోయింది. వాటి స్థానంలో తీసుకుని వచ్చిన గురుకుల, మైనారిటీ పాఠశాలల పరిస్థితి వర్ణనాతీతం. దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధునిక వసతులతో పాఠశాల భవనాలు నిర్మించడంలో విఫలమయ్యారు. నీళ్ళు, నిధులు, నియామకాలు (ఉద్యోగాలు) కోసం ఏర్పడిన ఈ రాష్ట్రంలో రెండేళ్ళు పూర్తయినా వీటిని నిర్వహించకపోవడం శోచనీయం.
తెలంగాణ లోని వర్సిటీల్లో దాదాపు 1200 మంది ప్రొఫెసర్లు అవసరం ఉండగా, కేవలం 135 మందితో కాలం వెలిబుచ్చుతున్నది ఈ ప్రభుత్వం. రెండు సంవత్సరాలుగా 11 యూనివర్సిటీలకు వైస్-్ఛన్సలర్లు లేరు. తద్వారా యుజిసి గ్రాంట్లు, రూసా నిధులు ఆగిపోయాయి. దీంతో అనేక పరిశోధనల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యూనివర్సిటీల్లో పేరుకుపోయిన మెస్ బిల్లుల బకాయిలు ఇంత వరకు చెల్లించలేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టమవుతున్నది. ఇంటర్ పాసైన విద్యార్థులకు ఢిగ్రీ అడ్మిషన్లలో కౌనె్సలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం హాస్యాస్పదం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిబిఎస్ విధానాన్ని ప్రవేశపెడతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేసింది. ఆ తర్వాత ఆ విషయానే్న మరిచింది. మరోవైపు కార్పోరేట్ కళాశాలలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజులు వసూలు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తున్నది. పేద పిల్లలకు డాక్టర్లు, ఇంజనీర్ల వంటి వృత్తి విద్య అవకాశాలు అందించేందుకు చేపట్టిన ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సరైన విద్యా విధానాన్ని రూపొందించాలి. ఇందుకు ప్రభుత్వం బేషజాలకు పోకుండా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలి.

కొనగాల మహేశ్, టి.పిసిసి అధికార ప్రతినిధి, పార్టీ నాలెడ్జ్ సెంటర్ కన్వీనర్