ఫోకస్

ప్రజల వెంటే నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసన మండలి 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే ఆరు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది ఒక రికార్డు. టిఆర్‌ఎస్ వరుస విజయాలను తట్టుకోలేకపోతున్న కొన్ని పార్టీల నాయకులు వలసలు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. వలసలు అనేవి ఇప్పుడే పుట్టినట్టుగా నాయకులు మాట్లాడుతున్నారు. వలసలు ఇప్పుడే మొదలు కాలేదు. వలసల గురించి విమర్శలు చేస్తున్న పెద్ద నాయకులు కూడా ఒకప్పుడు పార్టీలు మారినవారే. సిఎల్‌పి నాయకుడు కె జానారెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? ఆయన పార్టీ మారలేదా? టిడిపిలో మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరింది నిజంకాదా? టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు టిడిపితోనే రాజకీయాలు మొదలుపెట్టారా? గతంలో కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నది నిజంకాదా? ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వలసలు అంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, టిడిపి అగ్రనాయకులు కూడా వలస వచ్చినవారే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు. అప్పుడు పార్టీలు మారడం మంచిగా కనిపించింది ఇప్పుడు టిఆర్‌ఎస్‌లోకి కొందరు నాయకులు చేరుతుంటే నచ్చడం లేదా? చివరకు తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా టిఆర్‌ఎస్ ఎంపి, ఎమ్మెల్యేను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తే తప్పులేదు కానీ తెలంగాణ అభివృద్ధి టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం అని భావించి నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతుంటే తప్పు పడుతున్నారు. టిఆర్‌ఎస్‌లో ఇతర పార్టీల నాయకులు ఉద్యమ కాలంలో చేరారు. ఇప్పుడు చేరుతున్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఉద్యమం విజయవంతం అవుతుందనే నమ్మకంతో అప్పుడు అన్ని పార్టీలవారు టిఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ సంక్షేమంలో, అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కుతోంది. బంగారు తెలంగాణ కల సాకారం చేయడానికి తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపే ఉన్నారు. ఇటీవల జరిగిన వరంగల్ ఉపఎన్నికల్లో ఇది స్పష్టమైంది. దేశంలోనే ఒక రికార్డును సృష్టిస్తూ ఉప ఎన్నికల్లో నాలుగు లక్షల 59వేల ఓట్ల మెజారిటీతో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. ప్రజలు ఎటువైపు ఉంటే నాయకులు అటువైపు మొగ్గు చూపడం సహజం. అదే రీతిలో ఇతర పార్టీల నాయకులు టిఆర్‌ఎస్ వైపు వస్తున్నారు. ప్రలోభ పెట్టాల్సిన అవసరం టిఆర్‌ఎస్‌కు లేదు. ప్రజల అభిమానం మేరకు నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. వరంగల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్టుగానే మండలి ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాం.

- కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ ఐటి శాఖ మంత్రి