ఫోకస్

నిర్లక్ష్యం నీడలో ఉన్నత విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు తెలంగాణ విజ్ఞాన తెలంగాణవైపు దారితీస్తుందని భావించాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్నత విద్యారంగం మరింత దిగజారిందే తప్ప, మెరుగు కాలేదు. కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం వల్ల నాణ్యమైన విద్య గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. కాని వాస్తవపరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ తదితర యూనివర్సిటీలలో బోధనా, బోధనేతర సిబ్బంది లేరు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోనే పరిశోధన (పిహెచ్‌డి) చేసే వీలుంది, మిగతా విశ్వవిద్యాలయాల్లో ఈ సదుపాయం కల్పించలేదు. విశ్వవిద్యాలయాల్లో 1500 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ, భర్తీ చేయడం లేదు. ఇక నాణ్యమైన విద్య ఏ విధంగా లభిస్తుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. విద్యారంగానికి గత మూడు బడ్జెట్‌లలో ఇస్తున్న నిధులు చూడండి..ఎలా తగ్గిపోతున్నాయో! తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ఏడు మొత్తం బడ్జెట్‌లో 10.59 శాతం నిధులు కేటాయించగా, రెండో ఏడు ఇది 9.69 శాతానికి తగ్గింది. ఈ ఏడు దీన్ని 8.23 శాతానికి తగ్గించారు. పైవేట్ కాలేజీలపై ప్రభుత్వం విధానం వల్ల దాదాపు 20 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందలేకపోయారు. ఫీజురీఇంబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ప్రైవేట్ కాలేజీలను నియంత్రించడంలో తప్పులేదు..కాని పోలీసు అధికారులను పరిశీలన కోసం ఎందుకు పంపించారో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రైవేట్ కాలేజీల నుండి డబ్బుదండుకోవడానికే అనవసరమైన ప్రహసనాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలు ఉండగా, వీటిలో ఆరు విశ్వవిద్యాలయాలకు వైస్-్ఛన్సలర్లు లేరు. ఈ పరిస్థితిలో విశ్వవిద్యాయాల ద్వారా నాణ్యమైన విద్యను ఏ విధంగా ఆశించగలుగుతాము? ప్రతి శాసనసభా నియోజక వర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్, బిటిడి కాలేజీ పెడతామని టిఆర్‌ఎస్ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఈ హామీ ఇప్పటి వరకు అమలు కాలేదు.రాష్ట్రంలో ఉన్న 119 డిగ్రీకాలేజీల్లో పనిచేస్తున్న బోధనాసిబ్బందిలో 50 శాతం మంది కాంట్రాక్ట్‌ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇదిసరైన విధానం కాదు. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ యా యూనివర్సిటీల్లో కోర్సులను ఏర్పాటు చేస్తే బాగుండేది. బొగ్గుగనులు ఉన్న ప్రాంతంలో మైనింగ్ కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి..అలాగే ఇతర అంశాల్లో కూడా ఇదే రకమైన విధానాన్ని అమలు చేయాలి. ప్రభుత్వం శ్రద్ద తీసుకుంటేనే విజ్ఞాన తెలంగాణ ఏర్పాటుకు మార్గం ఏర్పడుతుంది.

సాంబశివ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎస్‌ఎఫ్‌ఐ.