ఫోకస్

నియంత్రణ మండలి ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో పెరుగుతున్న ఫీజుల ధోరణిని అరికట్టేందుకు ఒక నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి. ఎల్‌కెజి నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న కాలేజీలను నియంత్రణ మండలి పరిధిలోకి తీసుకురావాలి. ఇంటర్ నుంచి ఉన్నత విద్య వరకు కాలేజీల అడ్మిషన్ల ఫీజులను ప్రభుత్వం నిర్ణయించడమేకాకుండా, అమలయ్యేటట్లు చూడాలి. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించే విద్యా సంస్ధలపై కఠిన చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారాలు విద్యా శాఖకు ఉండాలి. ప్రతి ఏడాది ఈ మండలి ఫీజులను నిర్దేశించాలి. ఈ మండలికి చట్టపరమైన అధికారాలు కల్పించాలి. ఎక్కువ ఫీజులు వసూలు చేసే విద్యా సంస్ధల గుర్తింపును రద్దు చేసే విధంగా అధికారాలు ఉండాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి మొత్తం ఉన్నత విద్యను పేదల ముంగిటకు తీసుకువచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వైఎస్ ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన ఈ స్కీం వల్ల లక్షలాది మంది పేదలు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. దీని వల్ల అనంతరం వచ్చిన ప్రభుత్వాలు కూడా ఫీజురీ ఎంబర్స్‌మెంట్‌ను రద్దు చేయలేకపోయాయి. కాని ఈ విధానాన్ని కాలక్రమంలో నీరుకార్చేందుకు కుట్రలు పన్నుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ప్రభుత్వ కాలేజీల వ్యవస్ధ ఆగమ్యగోచరంగా తయారైంది. యూనివర్శిటీల్లో అధ్యాపకుల పోస్టులు భర్తీ కావడంలేదు. అనేక సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల సంగతి చెప్పనక్కర్లేదు. వౌలికసదుపాయాలు లేవు. అధ్యాపకులు లేరు. కాని ఎడాపెడా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల ఫీజును రెండు తెలుగు రాష్ట్రప్రభుత్వాలు పెంచాయి. ఇక ఇంటర్నేషనల్, కార్పోరేట్, ప్రైవేట్ కానె్వంట్లు ఇష్టం వచ్చినట్లు నియంత్రణ లేకుండా ఫీజులు పెంచాయి. ఎల్‌కెజి నుంచి లక్షల రూపాయల సొమ్మును కుమ్మరిస్తే తప్ప సీటు దొరకదు. ఇవన్నీ చూస్తుంటే చదువంటే భయం వేస్తుంది. విద్య వ్యాపారం కాదు. సంక్షేమ కోణంలో చూడాలి. విద్యా రంగం బాగుపడాలంటే ఇందులో ప్రైవేట్,కార్పోరేట్ శక్తుల చొరబాటుకు ఆనకట్టవేయాలి.

విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత