ఫోకస్

అపహాస్యం చేస్తున్నారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గవర్నర్ల వ్యవస్థకు కాలం చెల్లింది. బ్రిటిష్ కాలంనాటి పదవులు ఇవి. వీరివల్ల ఖజానాకు భారం. ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాజ్యాంగ పరిరక్షకులు తమ విధులను నిజాయితీతో నిర్వర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు మండిపడిన విషయం విదితమే. గవర్నర్లు రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా అపహాస్యం చేస్తున్నారు. గతంలోకి వెళితే రామ్‌లాల్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉండగా, ఒక్క కలంపోటుతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. దీనివల్ల గవర్నర్ల వ్యవస్థపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గవర్నర్ తీరుకు నిరసనగా 30 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యమించారు. గవర్నర్‌ను రీకాల్ చేయమని నినదించారు. చివరకు ప్రజల ఆగ్రహానికి తలొగ్గి ఎన్టీరామారావు చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించాల్సి వచ్చింది. గవర్నర్ ప్రజాస్వామ్య పరిరక్షకుడిలా మెలగాలి. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తగాదాలు ఉన్నాయి. గవర్నర్ ఏమి చేస్తున్నారు. ఇరువురు సిఎంలు కలిసి తమ బాధ చెప్పినా పరిష్కరించకలేపోతున్నారు. గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను కూడా ఇచ్చారు. దేశ వ్యాప్తంగా చాలాచోట్ల గవర్నర్లు రాజకీయాలకు ప్రభావితమవుతున్నారు. వీరు ఒక ఉత్సవ విగ్రహంలా తయారయ్యారు. కేంద్రానికి ఒక ఏజెంట్‌లాగా, మెసెంజర్‌లా వ్యవహరిస్తున్నందు వల్ల ఆ హోదా అంటే ప్రజల్లో పలుచన భావం నెలకొంది. చాలామంది గవర్నర్లు ప్రభుత్వ నిధులను ఉపయోగించుకుని కుటుంబ సభ్యులతో షికార్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, పిక్‌నిక్‌లకు వెళుతున్నారు. ఇదంతా ఖజానాపై భారం పడుతుంది. కాలానుగుణంగా గవర్నర్ల వ్యవస్థలో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది.

- కె శివకుమార్ ప్రధాన కార్యదర్శి, వైకాపా, తెలంగాణ శాఖ