ఫోకస్

మూలాల్లోకి వెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశానికి ఉగ్రవాదం కొత్తకాదు. వెయ్యి సంవత్సరాలుగా ఉగ్రవాద దాడులకు భారత్ తల్లడిల్లుతోంది. ఉగ్రవాదం గురించి మాట్లాడే ముందు దాని మూలాల్లోకి వెళ్లాలి. మా దేశంలో ఉగ్రవాదం లేదు అని చెప్పుకునే ఐరోపా, అమెరికా దేశాలు ఈ రోజు ఉగ్రవాద పెనుభూతం తాకిడికి అల్లాడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ సమస్యగా ఎదిగింది. ఉగ్రవాదం ఎక్కడ పుట్టింది.. ఎవరు పుట్టించారనేది అనే్వషిస్తే.. బిన్ లాడెన్ అయినా.. బింద్రన్‌వాలా అయినా.. ఎల్‌టిటిఇ ప్రభాకరన్ అయినా.. రాజకీయ నాయకుల, పాలకుల స్వార్థంతో పుట్టించిన బిడ్డలే. ‘ఎవరినో కాటు వేయడానికి పెంచిన పాము తననే కాటు వేస్తుంది.. అది పాము స్వభావం.. ఇది అమెరికా ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగేంత వరకు అమెరికాకు తెలిసిరాలేదు. భారతదేశం వరకు వస్తే పొరుగునవున్న పాకిస్థాన్‌లో పాలకులు ఎవరు వచ్చినా, వారికిష్టం వున్నా, లేకపోయినా భారతదేశంపై విషం చిమ్మితే తప్ప అక్కడ తమ మనుగడ సాగించలేరు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాలను ఈ రోజు మత ఉన్మాదమే కబళిస్తోంది. టర్కీలో లౌకిక ప్రభుత్వంపై మతశక్తులతో కూడిన సైనికులు తిరుగుబాటు చేస్తే లౌకిక తత్వం ఉన్న ప్రజలు ఎదిరించి పోరాడి ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్నారు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తామనే ఐఎస్‌ఐ, ఐఎస్‌ఐఎస్ సంస్థల కుతంత్రాలు సాగవు. ఎందుకంటే భారతదేశం మూలాల్లో లౌకికతత్వం ఉంది. రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి భారతీయ జన సంఘ్ అనే పార్టీ నాటినుంచి భారతీయ జనతా పార్టీగా మారినా అది ఎప్పుడూ సున్నితమైన అంశాలను ప్రజల్లో రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు దొడ్డిదారినే వెతికింది. దేశభక్తి తమకే సొంతం అని చెప్పుకునే కొన్ని పార్టీలు గోహత్య, హిందీ, కామన్ సివిల్ కోడ్ వంటి నినాదాలతో సమాజంలో వేర్పాటు వాదానికి బాటలు వేశారు. 1990 దశకంలో మందిర్-మసీదు పేరుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించారు. కాశ్మీర్ వేర్పాటువాద ధోరణులున్న పార్టీతో బిజెపి జతకట్టి ఆ రాష్ట్రంలో మిశ్రమ ప్రభుత్వంలో చేరింది. అధికారంలోకి వచ్చేముందు ఒక మాట, తర్వాత ఒక మాటగా బిజెపి తయారైంది. ప్రపంచంలో ఉగ్రవాదం పెరగడానికి అమెరికా కారణమైతే.. భారత్‌లో మైనార్టీల్లో అభద్రతా భావం పెంచడానికి ఎవరు కారకులో విజ్ఞులందరికీ తెలుసు. యువతలో ఆవేశ ఉక్రోషమే తీవ్రవాదంగా రూపాంతరం చెందుతుంది. ఉగ్రవాదులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తేవాలి. నిందితులను అరెస్టు చేసిన వెంటనే విచారణ చేసి దోషి లేదా నిర్దోషి అని తేల్చేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఏళ్లతరబడి కేసులను కోర్టులో నాన్చడం వల్ల ఏమి ప్రయోజనం. భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడిన ఘటనలపై అన్ని ప్రధాన నగరాల్లో కోర్టులను ఏర్పాటు చేయాలి. మతం కోణంలో ఉగ్రవాదాన్ని చూసే మనస్తత్వాన్ని విడనాడాలి.

- అశోక్ కుమార్ జైన్ ఆంధ్రప్రదేశ్ జైనుల సంఘం కన్వీనర్