ఫోకస్

అభివృద్ధికి ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెర్రరిజానికి కులం లేదు, మతం లేదు, పైశాచికత్వమే వారి అభిమతం. కాబట్టి ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అన్ని పార్టీలూ రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలి. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. ఉగ్రవాదుల దాడుల్లో, మారణ హోమంలో మా పార్టీ భారీగా నష్టపోయింది. ఉక్కు మనిషి ఇందిరా గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని పెరుంబుదూరులో మానవ బాంబు రూపంలో ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇది అత్యంత బాధాకరం. వారికి ఒకే ఉద్దేశ్యం ఉంటుంది. కీలకమైన వ్యక్తులను హతమార్చడం, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో బాంబులు పేల్చడం ద్వారా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని, దేశాన్ని అస్థిర పరిచి, అన్ని విధాలా కుంగ తీయాలన్న లక్ష్యంతో పని చేస్తారు. వారి దుశ్చర్యలను అరికట్టి, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేయాల్సిన అవసరం ఉంది. రాజీవ్ గాంధీని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడాన్ని నిరసిస్తూ 25 సంవత్సరాలుగా ప్రతి ఏడాది రాజీవ్ జయంతి, వర్ధంతి రోజన కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా సద్భావన దివస్ నిర్వహిస్తున్నది. ఈ మేరకు ఏర్పాటైన రాజీవ్ జ్యోతి సద్భావన కమిటీకి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే ఉగ్రవాదులు అత్యంత ఆధునికమైన పద్ధతులతో పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నారు. వాటిని నిర్వీర్యం చేయడానికి తగ్గట్లు మన దేశ పోలీసుల వద్ద ఆధునికమైన ఆయుధాలు, నిర్వీర్యం చేసే అధునాతమైన పరికరాలు ఉండాలి. పోలీసులకు మంచి నైపుణ్యం ఉండడం ఒక్కటే సరిపోదు వారికి అవసరమైన అత్యంత అధునాతనమైన ఆయుధాలూ అవసరమే. ఇటీవల హైదరాబాద్‌లో ఉగ్రవాదులు పొంచి ఉండడాన్ని ఎన్‌ఐఎ అరెస్టు చేయడం అభినందనీయం. లోగడ దిల్‌సుక్‌నగర్, గోకుల్ ఛాట్ వద్ద బాంబులు పేల్చి అమాయకులను బలిగొని, అల్లకల్లోలం సృష్టించారు. కాబట్టి ఉగ్రవాదుల చర్యలను అరికట్టి, ఉగ్రవాదులు నామరూపాలు లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహారించాలి. ఇందుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుంది. కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదన్న విషయాన్ని పక్కన పెట్టి, ఉగ్రవాదాన్ని అణచి వేసేందుకు అన్ని పార్టీలూ ముందుకు రావాలి. ఉగ్రవాదులను ఏరి వేయడం, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉగ్రవాదం దేశానికి ప్రమాదం అని, అభివృద్ధికి ఆటంకమని ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు కృషి చేయాలి.

- పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఎఐసిసి కార్యదర్శి