ఫోకస్

మిత్రపక్షంగా ఉంటూ.. సాధించింది ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక హోదా సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారు. హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా తెలుగుదేశం పార్టీ ఇంకా కేంద్ర మంత్రివర్గంలో కొనసాగడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో హోదా విషయంలో అమీతుమీ తేల్చుకోవాలి. కానీ అలా చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకుంటున్నారు. రెండేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఎంతో నిజాయితీగా రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటే, చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి అతి ముఖ్యమైన హోదాకు సంబంధించిన సమస్య వస్తే ఇదంతా కాంగ్రెస్ పాపం అని మాట్లాడుతున్నారు. రాజ్యసభలో మా పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రైవేటు బిల్లు పెడితే బిజెపి, టిడిపి నేతల గుండెలు అదిరాయి. రాజ్యసభలో బిల్లు ఓటింగ్‌కు వచ్చి పాస్ అయి ఉంటే ఆ రెండు పార్టీలకు పుట్టగతులు ఉండేవి కాదు. అందుకే బిల్లుపై రాజకీయం చేస్తున్నారు. దీనిలో ప్రథమ ముద్దాయి ముఖ్యమంత్రే అవుతారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు దేశంలోని అన్ని పార్టీలూ స్పందించాయి. తెలుగుదేశం పార్టీ మినహా అన్ని పార్టీలూ బేషరతుగా ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించాయి. తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రం కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. అందుకే ప్రత్యేక హోదా తేలేకపోతున్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించాలి. ప్రత్యేక హోదా కంటే రాష్ట్రానికి ఎంతో చేశామని, వేలకోట్ల రూపాయలు ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే చంద్రబాబు స్పందించడం లేదు. రెండేళ్ళ పాలనలో కేంద్రం నుంచి రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఏమిటో స్పష్టం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ సంతకాల ఉద్యమాన్ని చేపడితే చంద్రబాబు అపహాస్యం చేశారు. ఇప్పుడు బాబు దీనికి ఏమని సమాధానం చెబుతారు? బిజెపికి మిత్రపక్షంగా ఉంటూ, కేంద్ర మంత్రివర్గంలో చేరి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించకపోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు.

- డాక్టర్ శైలజానాథ్ సాకె ఎపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి