ఫోకస్

ఏపీకి ‘హోదా’ దక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మరోమారు విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రం కట్టుబడి ఉందని, సమస్యలను అర్థం చేసుకుంటామని, పరిష్కారానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు. ప్రత్యేక హోదాకు మరో ప్రత్యామ్నాయం లేదని తెలుగుదేశం, వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులు వాదిస్తున్నారు. ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలకు మించి ప్యాకేజీ ద్వారా సహాయం అందిస్తామని కేంద్రం పేర్కొంటోంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశం వివాదాస్పదంగా మారింది. ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయ. కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు సభ్యుడి బిల్లు తాజా ఆందోళనకు దారితీసింది. అయతే ఎన్‌డియే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే విషయం పరిశీలిస్తోంది. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టి దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించటం ద్వారా రాష్ట్రానికి అత్యధిక ఆర్థిక సహాయం చేయాలని బిజె.పి ప్రభుత్వం ఆలోచిస్తోంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను ప్రధానికి వివరించారు. ఆ సూచనతో ఏకీభవించిన నరేంద్ర మోదీ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వటంపై నీతి ఆయోగ్ కొన్ని ప్రతిపాదనలను సిద్దంచేసి ఆర్థిక శాఖకు పంపించిందనీ, ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ పరిశీలనలోనే ఉన్నాయని వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రికి వివరించారు. ఈ వ్యవహారంలో ఆర్థిక శాఖ మంత్రిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేయటం మంచిది కాదని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది. తెలుగుదేశం నాయకులు బాహాటంగా విమర్శలు గుప్పించకుండా బిజెపి అధినాయకులతో అంతర్గత చర్చలు జరిపితే బాగుండేదని వారంటున్నారు. ప్రభుత్వంలో కొనసాగుతూ ప్రభుత్వాన్ని విమర్శించటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనేది గత సంవత్సరమే చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశామని, ప్రత్యేక హోదాకు బదులు అత్యధిక ఆర్థిక సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉంటే చంద్రబాబు ఇలా విమర్శలు గుప్పించటం ఏమిటన్నది వారి ప్రశ్న. ప్రత్యేక హోదా ఇవ్వటం వలన ఏపికి వివిధ పథకాల అమలులో తొంబై శాతం గ్రాంటు, పది శాతం రుణం లభిస్తుంది, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏపికి అంతకంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని వారు వాదిస్తున్నారు. ఏపికి ప్రత్యేక హోదా కావాలా లేక అంతకంటే ఎక్కువ అర్థిక సహాయం కావాలా? అని ఒక సీనియర్ మంత్రి ప్రశ్నించారు. ఏపికి వీలున్నంత వరకు ఎక్కువ ఆర్థిక సహాయం, ఎక్కువ కాలం చేయటం కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని వారంటున్నారు. ఈ అంశంపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.