ఫోకస్

కాదంటే.. ఆగం అయిపోతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మమనుడు, యోగమనుడు, తత్వమనుడు
ప్రాణి సాధింపగల సకల పరమార్థములకు
తల్లిభాష ప్రధాన సూత్రంబుయగుట..
భాష కంటే నవ్యులకు తపస్సు లేదు
అన్నాడో మహాకవి - సమాజంలో ఏ మనిషి అయినాసరే ఏ కార్యక్రమం సాధించాలనుకున్నా, ధర్మసంబంధమైనా, యోగ సంబంధమైనా, తత్వ సంబంధమైనా, నిత్య జీవన వ్యవహార సంబంధమైనా అది మాతృభాషలోనే కొనసాగుతుంది, తల్లి భాషను మర్చిపోతే ప్రధాన సూత్రాన్ని వదిలినట్టు ఆగం అయిపోతాం. ప్రతి వ్యక్తికి రెండు జన్మలు. తల్లి జన్మనిస్తుంది, భాష జన్మనిస్తుంది. అందుకే భాషను తల్లి భాష అంటాం. పుట్టుకతో ఏ సమాజంలో పుడతామో ఆ జాతి భాష మాతృభాష అవుతుంది. జాతి వికాసానికి అదే ఆధారం అవుతుంది. కవులు అంతా మాతృ భాషను తపస్సులా సాధన చేయమన్నారు. సాధన చేసి పరిపక్వత సాధించిన వారు ఉన్నత స్థానంలో ఉంటారని ఇప్పటికే నిరూపింపబడింది. ఉద్యమానికి, రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించిన కెసిఆర్ భాష ద్వారానే అందర్నీ ఆకట్టుకున్నారు, సమస్యలు వ్యక్తం చేయగలిగారు, చరిత్రను సృష్టించగలిగారు. ప్రతి విద్యార్థి మాతృభాషను నేర్చుకోవాల్సిందే. మాతృభాష వస్తే అనేక ఇతర భాషలు తేలికగా వస్తాయని రుజువైంది. మాతృభాషా విధానం అంటూ ఉండాలి, ఏ ప్రభుత్వానికీ గతంలో మాతృభాషా విధానం లేదు, సాంస్కృతిక విధానం లేకపోవడం విచారకరం. మతృభాష వికాసానికి కేంద్ర ప్రభుత్వం చట్టంవల్ల ఆయా భాషల్లో ఆయా రాష్ట్రాల్లో మాతృభాషా పరిరక్షణలో ఏర్పడిన అకాడమిల్లో భాగంగానే 1968లో తెలుగు అకాడమి ఏర్పడింది. తెలుగు భాష, వికాసానికి అకాడమి చేసిన కృషి గణనీయమైంది. గత రెండేళ్లుగా తెలుగు అకాడమి విస్తృతి, నిర్వహణ గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమే. నాలుగు వేలకు పైగా గ్రంథాలను, 18 సాంకేతిక పదకోశాలు, నిఘంటువులు, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు, పాఠ్యగ్రంథాలను ముద్రించి ఎనలేని కృషి చేస్తోంది. తెలుగు అకాడమిని ఉపయోగించుకుని జాతి మొత్తాన్ని చైతన్య పరచవచ్చు. ప్రభుత్వం అకాడమిని ఉపయోగించుకోవాలి, జాతి మొత్తం విజ్ఞానవంతుల్ని చేయవచ్చు, అందుకు శక్తివంతంగా అకాడమిని తీర్చిదిద్దాల్సి ఉంది. దేశంలో అన్ని భాషల్లో తెలుగు భాషకు విశిష్ట స్థానం ఉంది. 15వ శతాబ్దం నుండి తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అంటారు. ప్రతి తెలుగువాడు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగువాడిగానే పుట్టాలి అనే భావాన్ని వ్యక్తం చేసే విధంగా మనం ఆలోచించాలి. ఎంతో మధుర మనోహరమైన గొప్పదైన భావాలు, శబ్దాలు ఉన్న ఏకైక భాష తెలుగు కావ్యాలు, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు తెలియాలంటే తెలుగు భాషలో ప్రతి ఒక్కరూ ప్రావీణ్యులు కావాలి. అపుడే మనం ఆశించే ప్రగతిని సాధించగలుగుతాం. వెల్చాల కొండల రావు ప్రారంభించిన మాతృభాషా పరిరక్షణ సమాఖ్య ప్రతిచోట సదస్సులు నిర్వహించబోతోంది. అందుకు మా వంతు తోడ్పాటు, సహకారాన్ని అందిస్తాం

- ప్రొఫెసర్ కె యాదగిరి మాజీ సంచాలకుడు, తెలుగు అకాడమి