ఫోకస్

మాతృభాష విద్యార్థి హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇరవై ఒకటవ శతాబ్దాన్ని డిజిటల్ యుగంగా పరిగణిస్తారు. కొన్ని దేశాలు ఇతర దేశాలు మిగిలిన దేశాల కన్నా ఎందుకు తొందరగా అభివృద్ధి చెందుతున్నాయి? ఈ అభివృద్ధి ఏ అంశాల ఆధారంగా జరుగుతోందో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులు, విస్తీర్ణంపైనే ఆధారపడి లేదని మానవ వనరుల సామర్థ్యంపైనే ఆధారపడి ఉందని తేలింది, అన్ని దేశాలలో మానవ వనరుల సామర్థ్యాలపైనే సర్వే జరుగుతోంది, ఆ సర్వేలో విద్యార్థుల చదువులు, వారి ఆలోచన విధానం, ఎదుగుదల ప్రతి రెండేళ్లకోమారు పరిశీలిస్తున్నారు, ఆ సర్వే ఆధారం చేసుకుని ర్యాంకులను కూడా ఇస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి. అగ్రరాజ్యంగా భావించే అమెరికాకు 28వ స్థానం దక్కింది. మొదటి స్థానం ఫిన్లాండ్, దక్షిణ కొరియా, సింగపూర్, పోలెండ్ వంటి దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు ఈ రోజు చదువుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇవి ఎలా అభివృద్ధి చెందాయి? అనే విషయం తెలుసుకునేందుకు అమెరికా నుండి అనేక బృందాలు ఈ దేశాలు పర్యటించి అధ్యయనం చేశాయి. విద్యారంగంపై సమాచారంతో కూడుకున్న పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రాథమిక విద్యారంగంపై ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికాలో రెండు మూడు భాషల్లో ప్రాథమిక విద్య కొనసాగుతోంది, కొన్ని ప్రాంతాల్లో స్పానిష్, కొన్ని ప్రాంతాల్లో ఇంగ్లీషు, కొన్ని ప్రాంతాల్లో చైనీస్ భాషల్లో కొనసాగుతోంది. ఏ భాషలో చదువుకునే పిల్లల్లో చురుకుదనం ఎక్కువగా ఉందో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. గతంలో విద్యాపాలకుల అభిప్రాయాన్ని రుద్దేవారు, కాని నేడు అలా లేదు, మానవవనరులపై ఒక పథకం ప్రకారం సమీక్ష జరుగుతోంది. విద్యార్థిపై ఇంటి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. పిల్లల మానసిక ఎదుగుదలపై మాతృభాష ప్రభావం ఎక్కువగా ఉంది. ఒకే పాఠశాలలో రెండు మూడు మాతృభాషల విద్యార్థులపై కూడా సమీక్ష చేసి చూశారు. గతంలో టీచర్ చెప్పిందే జరిగేది, తర్వాత కాలంలో తల్లిదండ్రులు సూచించింది పిల్లలు చదివేవారు, కాని నేడు ఆ పరిస్థితి మారింది. విద్యార్థి కేంద్రీకృతంగా చదువు వచ్చింది. విద్యార్థికి కూడా నేర్చుకునే హక్కు ఉందని ఇపుడిపుడే గుర్తిస్తున్నారు. తన మాతృభాషలో నేర్చుకోవడం కూడా విద్యార్థి హక్కుగా మారింది. మాతృభాషలో నేర్చుకుంటే అవగాహన శక్తి, గ్రాహ్యశక్తితోపాటు కమ్యూనికేటివ్ స్కిల్స్ పెరుగుతున్నాయి. చదివిన విషయాన్ని ఎంతవరకూ అర్థంచేసుకున్నాడో, మానసికంగా జ్ఞాపకం ఉంచుకున్నాడో కూడా పరిశీలిస్తున్నారు. మెదడులో జ్ఞాపక శక్తికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. విషయాన్ని మాతృభాషలో చెప్పినపుడు మెదడులో జరిగే రసాయిన చర్యలను పరిశీలించారు. మాతృభాషలో చెప్పినపుడు విషయ గ్రాహ్యశక్తి త్వరగా జరుగుతున్నట్టు గుర్తించారు. విద్యార్థి ప్రగతి రికార్డులను కూడా పాఠశాలలు నిర్వహిస్తున్నాయి. నాలుగేళ్లలో వారి ప్రగతి- ఎదుర్కొంటున్న సమస్యలు నమోదు చేసి తల్లిదండ్రులకు వివరించి చెబుతున్నారు. ఫ్రాన్స్‌లో ఫ్రెంచిలో, జపాన్‌లో జపనీస్‌లో చెబుతున్నారు, అమెరికా పక్కనే ఉన్న అనేక దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతోంది, మనకూ మాతృభాషే శరణ్యం. మనకి ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి, మన హక్కును సాధించుకోవడం మన కర్తవ్యం.

- డాక్టర్ చుక్కా రామయ్య విద్యా వేత్త, మాజీ ఎమ్మెల్సీ